- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur thought of taking her own life when trying for movie auditions after acting in TV serials
అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందిని వెంటాడుతున్న సమ్యసల్లో డిప్రషన్ ఒకటి. చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా మంది డిప్రషన్ సమస్యను ఎదుర్కొన్నారు. కొంతమంది సినిమాల విషయంలో.. మరికొంతమంది రిలేషన్స్ షిప్స్ విషయంలో డిప్రషన్ లోకి వెళ్లారు. కొంతమంది డిప్రషన్ నుంచి బయట పడ్డారు.. మరికొంతమంది మాత్రం డిప్రషన్ వల్ల కెరీర్ కోల్పోయారు.. మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
Updated on: Jul 07, 2025 | 1:58 PM

అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా డిప్రషన్ కారణంగా సూసైడ్ చేసుకుందామనుకున్నా అని తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమెను చనిపోయే అంత సమస్య ఏమొచ్చింది.? వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ డిప్రషన్ కు ఎందుకు గురైందో చూద్దాం.!

టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.

అంతే కాదు తెలుగులో ఈ చిన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. సీరియల్స్ లో చేసిన తర్వాత సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించా.. ఆసమయంలో టీవీ నటి అంటూ చులకనగా చూశారు. ఎంతో అవమానించారు దాంతో డిప్రషన్ లోకి వెళ్ళా.. ఒకసారి డిప్రషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. కానీ నా పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.