- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Fame Kevvu Kartheek Visits Dwaraka Tirumala Venkateswara Temple With His Family, See Photos
Kevvu Kartheek: భార్యతో కలిసి ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఆధ్యాత్మిక యాత్రలతో బిజి బిజీగా ఉంటున్నాడు. తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ ఆలయాలన్నింటినీ చుట్టేస్తున్నాడు. తాజాగా కెవ్వుకార్తీక్ తన ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి
Updated on: Jul 07, 2025 | 9:18 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకడు. మొదట ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు

మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన కార్తీక్ ఆ తరువాత జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టాడు. తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మొదట ధనాధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేరిన అతను ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్ టీమ్ లోనూ మెరిశాడు

ఇక 2016లో ముక్కు అవినాష్ తో కలిసి టీమ్ లీడర్ అయిపోయాడు కార్తీక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్ గా నే కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులకు తనదైన వినోదం అందిస్తున్నాడు. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలతో మెరుస్తున్నాడు కార్తీక్.

ఇక అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిస్తున్నాడు కెవ్వు కార్తీక్. ఈ మధ్యన ముఖ చిత్రం, నేడు స్టూడెంట్ సార్ సినిమాల్లో కార్తీక్ కీలక పాత్రలు పోషించాడు. ఇందులో ముఖ చిత్రం సినిమాకు ప్రశంసలు వచ్చాయి.

జబర్దస్త్ షూటింగులతో బిజీగా ఉండే కెవ్వు కార్తీక్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల వెళ్లాడు. శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

అంతకు ముందు స్వర్ణగిరి, యాదగిరి ఆలయాలను సందర్శించింది కార్తీక్ ఫ్యామిలీ. కాగా 2023లో శ్రీలేఖ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కార్తీక్.




