AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: ఆనంద్ సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న కమలిని ముఖర్జీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. జీవితంలో ముఖ్యమైన ప్రేమ, ఆత్మాభిమానం.. తృప్తి వంటి అంశాలను సినిమాగా వెండితెరపైకి తీసుకువచ్చారు.

Anand: ఆనంద్ సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న కమలిని ముఖర్జీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
Kamalini Mukharjee
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2023 | 9:25 AM

Share

ఆనంద్.. ఒక మంచి కాఫీ లాంటి సినిమా.. క్యాప్షన్‏కు తగినట్టుగానే నిజంగానే మనసులను హత్తుకునే చిత్రం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. జీవితంలో ముఖ్యమైన ప్రేమ, ఆత్మాభిమానం.. తృప్తి వంటి అంశాలను సినిమాగా వెండితెరపైకి తీసుకువచ్చారు. పెద్ద తారాగణం లేకుండా..సాదాసీదా కథనంతో వెలువడి అనూహ్యమైన విజయం సాధించింది. ఇందులో రాజా, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ కమలిని. జీవితంలో అమ్మనాన్నలను పోగొట్టుకుని స్నేహితుల సాయంతో జీవిస్తున్న ఆత్మావిశ్వసం ఉన్న అమ్మాయి రూప పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఆనంద్ తర్వాత గోదావరి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో ఆకట్టుకుంది. తర్వాత స్టైల్, క్లాస్ మేట్స్, హ్యాపీ డేస్, పెళ్లైంది కానీ, జల్సా, గమ్యం, గోపి గోపిక గోదావరి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే చివరిసారి మన్యం పులి చిత్రంలో కనిపించిన కమలిని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 42 ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది. తన సోదరీలతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కమలిని. ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింద సక్సెస్ అయ్యింది కమలిని. ప్రస్తుతం ఆమె వ్యాపారరంగంలో బిజీగా ఉంది.

కథ నచ్చితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించిన కమలినికి స్కూల్ డేస్ నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో ముంబైకి చేరుకుంది. కేవలం నటన మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక పుస్తక పఠనం.. చిత్రలేఖనంలోనూ కమలిని టాలెంటెడ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..