Waltair Veerayya: ‘నా జీవితంలో మర్చిపోలేని మూమెంట్.. ఆఫోటోను ఫ్రేమ్ కట్టించుకున్నాను’.. డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్..
వాల్తేరు వీరయ్య చిత్రంతో థియేటర్లలో మాస్ రచ్చ చేసేందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన వీరాభిమాని డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు.

చిరు సినిమా అంటే మెగా అభిమానులకు పండగే. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు చిరు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రంతో థియేటర్లలో మాస్ రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఆయన వీరాభిమాని డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ఇంట్రడక్షన్ గ్లింప్స్, పూనకాలు లోడింగ్ పాటకు ట్రైమండస్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈనెల 13న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాబీ మాట్లాడుతూ.. “చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. ఆయన సినిమాలో పని చేయాలనే ఒక కల వుండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదలౌతుంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది. చిరంజీవి గారు, రవితేజ గారు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చాను. వాళ్ళిద్దరితో సినిమా చేయడం నా అదృష్టం. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి డిజైన్ చేయడం జరిగింది.




153 సినిమాలు చేసిన చిరంజీవి గారు నేను చేసిన వాల్తేరు వీరయ్య సినిమా చూస్తున్నారంటే నాకు రెండు రాత్రుల నిద్రలేదు. ఆయన జడ్జ్మెంట్ చాలా పక్కాగా వుంటుంది. వాల్తేరు వీరయ్య మొత్తం చూసి ‘’వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బాబీ’’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం సర్రియల్ మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా ” అంటూ చెప్పుకొచ్చారు.




