Geethanjali: గీతాంజలి సినిమాలో హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పిన నటి ఎవరో తెలుసా..

రిజల్ట్ తో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ లెజెండ్ డైరెక్టర్ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా గీతాంజలి.

Geethanjali: గీతాంజలి సినిమాలో హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పిన నటి ఎవరో తెలుసా..
Geethanjali
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2023 | 1:42 PM

మణిరత్నం దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ లెజెండ్ డైరెక్టర్ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా గీతాంజలి. ఈ సినిమా 1989లో తెరకెక్కింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా గిరిజ నటించారు. ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఈ చిత్రం  ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే ఆరు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. గిరిజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా..  గిరిజ ఒక బ్రిటిష్ నటి. గిరిజ తండ్రి కన్నడ, తల్లి బ్రిటీష్. దాంతో ఈమెకు తెలుగు తెలియదు.

దాంతో ఆమె పాత్రకు తెలుగులో మరో నటితో డబ్బింగ్ చెప్పించారు మణిరత్నం.. ఆ నటి ఎవరో కాదు రోహిణి. నటుడు రఘువరన్ సతీమణి అయినా రోహిణి. ఇప్పుడు టాలీవుడ్ లో సహాయక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. నటి కాక ముందు రోహిణి పలువురు హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో విజయశాంతికి తప్ప దాదాపు అందరు హీరోయిన్స్ కు రోహిణి డబ్బింగ్ చెప్పారట.Rohini

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి