Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Apte: హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్న రాధికా ఆప్టే

బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా ఈ అమ్మడికి మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలంలో సౌత్ లో సినిమాలు తగ్గించింది ఈ చిన్నది. అలాగే ఈ అమ్మడు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ తోనూ న్యూస్ లో నిలిచింది.

Radhika Apte: హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్న రాధికా ఆప్టే
Radhika Apte
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2023 | 1:29 PM

రాధికా ఆప్టే.. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది రాధికా. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా ఈ అమ్మడికి మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలంలో సౌత్ లో సినిమాలు తగ్గించింది ఈ చిన్నది. అలాగే ఈ అమ్మడు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ తోనూ న్యూస్ లో నిలిచింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గురించి చాలా మంది బామలు మాట్లాడారు. తాజాగా రాధికా కూడా హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై హాట్ కామెంట్స్ చేసింది.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు, ఇతర మహిళలకు రెమ్యునరేషన్, మర్యాద, పేరు విషయాలలో సమానంగా ఉండాలని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. సినిమా రంగంలో రాణించడానికి ఆడవాళ్లు చాలా కష్టపడుతున్నారు. అలంటి వారిని స్వాగతించాలి ఆమె అన్నారు.

ఇటీవల ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మగవాళ్ళతో పాటు మగువలకు కూడా సమన ప్రాధాన్యత ఇవ్వాలని రాధికా కోరింది. ఇతర రంగాలలో సైతం ఆడ, మగ అనే డిఫరెన్స్ లేని పరిస్థితి ఏర్పడిందని రాధికా అభిప్రాయపడింది. ఇప్పుడు ఈ కామెంట్స్ బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాధికా ఇలా కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె పలు సార్లు ఇదే విషయం పై కామెంట్స్ చేశారు .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.