Jr.NTR: ఎన్టీఆర్‌కు ఒకే సినిమాలో భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా.. ఏం చేస్తుందంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు సినిమా ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరీ లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్న హీరోలలో తారక్ కూడా. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే వార్2 చిత్రంతో బాలీవుడ్ సినీప్రియుల హృదయాలు గెలుచుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇందులో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు తారక్. ఇందుకోసం ఇప్పటికే పూర్తిగా బక్కగా మారిపోయి .. పెద్ద గడ్డంతో గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
అలాగే దేవర 2 చిత్రం సైతం మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. అయితే చేతినిండా సినిమాలతో తారక్ బిజీగా ఉన్న సమయంలో అతడికి భార్యగా, తల్లిగా రెండు పాత్రలు పోషించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? అవును.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ఆమె. వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికలలో ఆమె ఒకరు. సీనియర్ హీరోలకు జోడిగా నటించిన ఆమె.. తారక్ నటించిన ఓ సినిమాలో అతడి భార్యగా, తల్లిగా కనిపించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సంఘవి. ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
ఎన్టీఆర్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఆంధ్రావాలా సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య 2004లో విడుదలైన ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ పోషించారు. ఇందులో శంకర్ పెహల్వాన్ పాత్రలో తారక్ కనిపించాడు. అతడి భార్యగా సంఘవి నటించింది. కానీ కొడుకు పుట్టిన తర్వాత సంఘవి చనిపోతుంది. కొడుకుగా మరోసారి తారక్ కనిపించాడు. అలాగే ఒకే సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా, భార్యగా కనిపించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది సంఘవి.

Sanghavi
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
