AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రియాల్టీ షో కోసం రూ.25 కోట్లు.. స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. ఈ బ్యూటీ ఎవరంటే..

ఒకప్పుడు భారతీయ సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. అప్పట్లో కుర్రాళ్ల కలల రాకూమారి. స్టార్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది.

Tollywood: రియాల్టీ షో కోసం రూ.25 కోట్లు.. స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. ఈ బ్యూటీ ఎవరంటే..
Madhuri Dixit
Rajitha Chanti
|

Updated on: May 15, 2025 | 3:20 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. హిందీ చిత్రపరిశ్రమలో దాదాపు 70 సినిమాలకు పైగా సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 1980 నుంచి ఇప్పటివరకు సినీరంగుల ప్రపంచంలో అద్భుతమైన నటనతో తనదైన ముద్రవేసింది. ఆమె అందం, అభినయానికే కాదు.. ఆమె డ్యాన్స్ స్కిల్స్ చూసి ముగ్దులైన ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మాధురి దీక్షిత్. ఈరోజు (మే 15) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. మాధురి దీక్షిత్ 17 ఏళ్ల వయసులోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 56 సంవత్సరాలు. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది.

ఇదిలా ఉంటే.. మాధురి దీక్షిత్ మొత్తం ఆస్తుల విలువ రూ.250 కోట్లపైగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అలాగే మాధురీ దీక్షిత్ ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తో అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది.

అయితే ఆ రియాల్టీ షోకు జడ్జిగా ఉండేందుకు ప్రతి సీజన్ కు రూ.25 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అలాగే ఒక ప్రకటనలో నటించడానికి రూ.8 కోట్లు తీసుకుంటుందని టాక్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. సినిమాలే కాకుండా మాధురీ దీక్షిత్ వెబ్ సిరీస్ సైతం చేస్తుంది. ఆమె నటించిన ది ఫేమ్ గేమ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు