- Telugu News Photo Gallery Cinema photos Alia Bhatt helped Samantha Trivikram combo film in the Tollywood
Samantha – Trivikram: గురూజీ డైరక్షన్‌లో సామ్.. ఈ కాంబోలో మూవీకి ఆలియా సాయం..
ఇండస్ట్రీలో లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్... త్రివిక్రమ్ డైరక్షన్‌లో సమంత త్వరలోనే సినిమా చేయబోతున్నారన్నదే. వీరిద్దరి కాంబోని ఫిక్స్ చేసింది ఆలియా అన్నదే. సామ్ - గురూజీ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చేసిన సాయం ఏంటనే డౌట్ వస్తోందా? ఆలస్యమెందుకు.. మాట్లాడుకుందాం పదండి.
Updated on: May 15, 2025 | 3:40 PM

త్రివిక్రమ్ డైరక్షన్‌లో సమంత అనగానే అందరికీ వరుసగా సినిమాల పేర్లు గుర్తుకొచ్చేస్తాయి. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. ఇలా వారి కాంబోలో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఆ తర్వాత త్రివిక్రమ్‌కి సమంత అందుబాటులోకి రాలేదా?

అదీ సంగతి... ముంబైలోనే సామ్ బిజీగా ఉంటే, గురుజీ ఇక్కడ సినిమా ఎలా చేయాలి? అంటారా? త్రివిక్రమ్ మంచి స్క్రిప్ట్ రాస్తే నేనెందుకు చేయనని సమంత చేసిన సైగల్ని కూడా గమనించాలి మనం...

సో గురూజీ జబర్దస్త్ స్క్రిప్ట్ రాస్తే... చేయడానికి నేను రెడీ అని ఆలియా సాక్షిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సామ్. అప్పటి నుంచి ఆ జబర్దస్త్ లైన్ గురించి ఆలోచించారేమో గురుజీ ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ చేశారట.

అల్లు అర్జున్ - అట్లీ సినిమా కంప్లీట్ అయ్యే సరికి టైమ్ పడుతుంది. ఈ గ్యాప్‌లో వెంకటేష్‌తో త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చనే టాక్ నడిచింది. అయితే లేటెస్ట్ గా సామ్ ప్రాజెక్ట్ గురించి టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ గురూజీ నెక్స్ట్ స్టెప్ ఎటు... వెంకటేష్‌తోనా? సామ్‌తోనా?

ఇటీవల సమంత కూడా తెలుగు వరుస సినిమాలు సిద్ధమని తాను నిర్మాతగా చేసిన శుభం సినిమా ప్రొమోషన్స్ సమయంలో వెల్లడించారు. ఆమె నిర్మాతగా ప్రస్తుతం తెలుగులో మా ఇంటి మహాలక్ష్మి సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే త్రివిక్రమ్ మూవీ చేసే ఛాన్స్ లేకపోలేదు.




