- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Heroine Who Scored The First Hit In Her Film Career, She Is Ketika Sharma
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెరీర్లో మొదటి హిట్టుకొట్టిన హీరోయిన్.. అమ్మాడికి కలిసొచ్చిన అదృష్టం..
టిక్ టాక్ వీడియోస్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ యూట్యూబ్ స్టార్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ మొత్తంలో మొదటిసారి హిట్టుకొట్టింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: May 15, 2025 | 3:49 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న బుజ్జాయి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కేతిక శర్మ. ఇప్పటివరకు తెలుగులో 5 సినిమాల్లో కథానాయికగా నటించింది. అందులో నాలుగు సినిమాలు మిశ్రమ స్పందన అందుకున్నాయి. కానీ థియేటర్లలో ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి.

కానీ తాజాగా ఆమె కెరీర్ మొత్తంలో మొదటిసారి సూపర్ హిట్ అందుకుంది. అదే సింగిల్. ఇటీవలే కేతిక శర్మ, ఇవానా, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక హిట్టు కొట్టిన ఆనందంలో తాజాగా చీరకట్టులో ఫోటోషూట్ షేర్ చేసింది కేతిక. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

ఫస్ట్ మూవీ డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత ఆమె నటించిన లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవలే నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో అదిదా సర్ ప్రైజ్ అనే స్పెషల్ పాటలో మెరిసింది.




