K-Ramp: కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. కె ర్యాంప్ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. ?
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్టు పడింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కె ర్యాంప్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ప్రారంభమయ్యింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కిరణ్ సరసన యుక్తి తరేజా జంటగా నటించగా.. అక్టోబర్ 18న అడియన్స్ ముందుకు వచ్చింది.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో… ఇప్పుడు కె ర్యాంప్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మకు సయంక్తుగా నిర్మించారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా కథానాయికగా నటించగా.. శనివారం (అక్టోబర్ 18న) ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, హీరోహీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఇప్పుడు మంచి టాక్ వస్తోంది. నివేదికల ప్రకారం ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే ఈ సినిమా ఏకంగా రూ.4.5 కోట్ల గ్రాస్ రాబట్టిందట. దేశవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజే రూ.2.15 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని.. మార్నింగ్ షోల్లో 26.10 శాతం మాత్రమే నమోదైన ఆక్యుపెన్సీ సెకండ్ షోకు వచ్చేసరికి 51.27 శాతానికి పెరగడానికి విశేషం. ఇక ఇప్పుడు ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింత పెరగనున్నాయని సమాచారం.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఇదిలా ఉంటే.. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ సినిమాకు ముందుగా యూత్ స్టార్ నితిన్ అనుకున్నారట. కథ కూడా ఆయనకు వినిపించగా.. బాగా నచ్చిందని.. సినిమా చేసేందుకు ఒకే కూడా చెప్పారట. కానీ ఈ సినిమాకు ఎలాంటి బ్యాగేజ్ లేని హీరో కావాలని.. తనపై ఇలాంటి కథ వర్కౌట్ కాదని చెప్పి సినిమా నుంచి తప్పుకున్నారట నితిన్. దీంతో ఈ మూవీ కిరణ్ వద్దకు చేరింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి నితిన్ ఫ్యాన్స్ డిజాప్పాయింట్ అవుతున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..




