Kiccha Sudeep: అయ్యా బాబోయ్.. హీరో కిచ్చా సుదీప్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా..? హీరోయిన్లకు మించిపోయిందిగా..

సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఇన్నాళ్లు కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ టాలీవుడ్ అడియన్స్ ముందుకు మాత్రం విలన్ పాత్రతో పరిచయమయ్యాడు.

Kiccha Sudeep: అయ్యా బాబోయ్.. హీరో కిచ్చా సుదీప్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా..? హీరోయిన్లకు మించిపోయిందిగా..
Sudeep
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 01, 2024 | 3:05 PM

కన్నడలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యాడు. నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీలో సుదీప్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీప్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈగ సినిమా తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు సుదీప్. అలాగే హిందీలోనూ కొన్ని సినిమాలు చేసి అలరించాడు కిచ్చ సుదీప్. ప్రస్తుతం కన్నడలో హీరోగా బిజీగా కొనసాగుతున్న సుదీప్.. అటు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో హోస్టింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా సుదీప్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కిచ్చా సుదీప్ గురించి ఓ విషయం నెట్టింట వైరలవుతుంది.

సుదీప్ తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ ప్రేక్షకులకు సుదీప్ ఫ్యామిలీ గురించి సుపరిచితమే. అయితే ఇప్పుడు సుదీప్ కూతురి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆమె పేరు సాన్వీ సుదీప్. అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. త్వరలోనే ఈ బ్యూటీ సినిమాల్లోకి రానుందని అంటున్నారు. కానీ సుదీప్ కూతురికి సింగర్ కావాలని ఉందట. అందుకే ఇప్పుటికే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంది. సాన్వికి సంగీతం అంటే ఆసక్తి, రాయడం, పాడడం చాలా ఇష్టం. సుదీప్ మేనల్లుడు నటించిన ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా పాడింది.

ఇక సాన్వీ కొన్నాళ్ల క్రితం చిన్న టాటూ వేయించుకుంది. ఓ ఇంట్రెస్టింగ్ పచ్చబొట్టు వేయించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాన్వి సుదీప్ మెడపై ‘పీకు’ అని టాటూ వేయించుకుంది. పీకూ అనేది హిందీ సినిమా పేరు అనుకోకండి. ఆ పేరు వెనుక పెద్ద కథే ఉంది. పీకూ అనేది సాన్వీ తల్లి ప్రియా సుదీప్ ముద్దుపేరు. ప్రియా సుదీప్‌ను ఆమె తాత పీకు అని పిలుచుకునేవారు. అందుకే సాన్వీ తన తల్లి పేరును టాటూ వేయించుకుంది. ఈ టాటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.