Srikanth Odela: తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు.. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్ ఓదెల ?..

ముఖ్యంగా నాని నటనతోపాటు.. డైరెక్టర్ టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా వెండితెరకు పరిచమైన శ్రీకాంత్ ఓదెలా తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న దసరా చిత్రానికి.. టేకింగ్ విషయంలో టెక్నికల్ అంశాల విషయంలో శ్రీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Srikanth Odela: తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు.. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్ ఓదెల ?..
Sirkanth Odela
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2023 | 10:05 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్న చిత్రం దసరా. మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. న్యాచురల్ స్టార్ నాని.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా తొలి రోజే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అంతేకాకుండా.. గత చిత్రాలకంటే.. ఊరమాస్ పాత్రలో అదరగొట్టాడు. ఇక వెన్నెల పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ఇక ఇప్పుడు ఎక్కడా చూసిన దసరా సినిమా గురించే టాక్. ముఖ్యంగా నాని నటనతోపాటు.. డైరెక్టర్ టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా వెండితెరకు పరిచమైన శ్రీకాంత్ ఓదెలా తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న దసరా చిత్రానికి.. టేకింగ్ విషయంలో టెక్నికల్ అంశాల విషయంలో శ్రీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో అందరి గుర్తింపు సంపాదించేసిన శ్రీకాంత్ కు .. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీకాంత్ ఓదెలా ఎవరు ?.. దసరా సినిమా ఆయనకు తొలి సినిమా కాదన్నట్లుగా తెలుస్తోంది. దీంతో శ్రీకాంత్ గురించి సెర్చింగ్ మొదలు పెట్టారు సినీ ప్రియులు.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ ఓదెలా.. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే. రంగస్థలం, చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. శ్రీకాంత్ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమా నిర్మాణం, స్క్రీన్ రైటింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో సినీరంగం వైపు అడుగులు వేశాడు. 2016లో టూ ఫాదర్ విత్ లవ్ షార్ట్ ఫిల్మ్ కు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఆతర్వాత సుకుమార్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు. బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.