Dasara: ఇది కదా సక్సెస్ అంటే.. ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్‌ను తొలి రోజే దాటేసిన నాని

శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నాని మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో మెప్పించాడు నాని.

Dasara: ఇది కదా సక్సెస్ అంటే.. ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్‌ను తొలి రోజే దాటేసిన నాని
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2023 | 7:03 AM

నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఊర మాస్ కంటెంట్ తో తెరకెక్కిన దసరా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నాని మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో మెప్పించాడు నాని. ఈ సినిమాలో నాని సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా దసరా భారీ ఓపినింగ్స్ ను సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లో బిగెస్ట్ ఓపినింగ్ సాధించిన సినిమాగా దసరా నిలిచింది. తొలి రోజే దసరా సినిమా 38 కోట్లు వరుకు వసూల్ చేసింది.

అయితే నాని నటించిన లాస్ట్ మూవీ అంటే సుందరానికి సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ మొత్తంను దసరా మూవీ తొలిరోజే సాధించి రికార్డు క్రియేట్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అంటే  సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోగా ఓవర్ ఆల్ గా 38 కోట్లు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు దసరా సినిమా తొలి రోజే 38 కోట్లు వసూల్ చేసి నాని కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో నాని ఫ్యాన్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.