Divyansha Kaushik : మరో తెలుగు సినిమాలో నటించనున్న మజిలీ భామ.. ఆ యంగ్ హీరోకు జోడీగా దివ్యాన్ష కౌశిక్

నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమా ద్వారా ఆతెలుగు ప్రేక్షుకులకు పరిచయమైన భామ దివ్యాన్ష కౌశిక్. మజిలీ సినిమా విజయం సాధించినా దివ్యాన్ష కౌశిక్ కి అవకాశాలు రాలేదు. తెరమీద కనిపించే అవకాశం లేకపోయినా

Divyansha Kaushik : మరో తెలుగు సినిమాలో నటించనున్న మజిలీ భామ.. ఆ యంగ్ హీరోకు జోడీగా దివ్యాన్ష కౌశిక్
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 11, 2021 | 3:14 AM

Divyansha Kaushik : నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమా ద్వారా ఆతెలుగు ప్రేక్షుకులకు పరిచయమైన భామ దివ్యాన్ష కౌశిక్. మజిలీ సినిమా విజయం సాధించినా దివ్యాన్ష కౌశిక్ కి అవకాశాలు రాలేదు. తెరమీద కనిపించే అవకాశం లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన సూపర్ హాట్ ఫోటో షూట్ లతో యువతని పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

దివ్యాన్ష కౌశిక్‌ చాలా రోజుల గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించనుంది. కేపీ రాజేంద్ర (డెబ్యూట్‌) దర్శకత్వంలో హీరో నాగశౌర్య నటిస్తోన్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. యాక్షన్‌ కాప్‌ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో నటించేందుకు దివ్యాన్ష సంతకం చేసింది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేక‌ర్స్ దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఇక ఈ సినిమాతోపాటు శౌర్య మరో రెండు సినిమాలో నటిస్తున్నాడు.  సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు వరుడుకావలెను అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు నాగశౌర్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Paagal Movie : ప్రేమ కోసం పరితపించే ‘పాగల్’.. ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ మూవీ టైటిల్ సాంగ్

Mahesh Babu – SS Rajamouli : ఆ విషయంలో రాజమౌళి వెనకడుగు వేస్తుంటే.. మహేష్ ముందడుగు వేస్తున్నాడట.. అసలు విషయం ఏంటంటే..

Sashi Movie Trailer : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ చేతుల మీదుగా ఆది సాయికుమార్‌ ‘శ‌శి’ ట్రైల‌ర్‌..