Prabhas Adipurush : ప్రభాస్ కు తమ్ముడిగా బాలీవుడ్ యంగ్ హీరో.. ‘ఆదిపురుష్’ లో లక్ష్మణుడిగా నటించే లక్కీహీరో అతడేనా..?

 ప్రస్తుతం వరుస చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌. ప్రభాస్  హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న

Prabhas Adipurush : ప్రభాస్ కు తమ్ముడిగా బాలీవుడ్ యంగ్ హీరో.. 'ఆదిపురుష్' లో లక్ష్మణుడిగా నటించే లక్కీహీరో అతడేనా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 11, 2021 | 3:36 AM

Prabhas Adipurush : ప్రస్తుతం వరుస చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌. ప్రభాస్  హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్‌’ సెట్స్‌పై ఉంది. తాజాగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారాయన. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేష్‌ అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఆవిష్కరిస్తూ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడిగా ఎవరు నటిస్తారన్నదని పై చాలా కాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా  మరో యంగ్ హీరో పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ హీరో విక్కీకౌశ‌ల్‌ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ తమ్ముడిగా కనిపించనున్నాడని అంటున్నారు . విక్కీకౌశ‌ల్‌ యురి సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. విక్కీకౌశ‌ల్‌ ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా కనిపించనున్నాడని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నదని పైన కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా కత్రినా కైఫ్ అంటూ పలు పేర్లు వినిపించినప్పటికీ చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Divyansha Kaushik : మరో తెలుగు సినిమాలో నటించనున్న మజిలీ భామ.. ఆ యంగ్ హీరోకు జోడీగా దివ్యాన్ష కౌశిక్

Priya Prakash Varrier : తెలుగులో ఒకటి హిందీలో మరొకటి… ఆ రెండు సినిమాల పైనే ఈ అమ్మడి ఆశలు..

Paagal Movie : ప్రేమ కోసం పరితపించే ‘పాగల్’.. ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ మూవీ టైటిల్ సాంగ్