AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్.. బీటౌన్ డైరెక్టర్ కసరత్తులు.. పండగ చేసుకుంటున్న అభిమానులు..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫుల్ జోరు మీదున్నాడు. వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువస్తూ.. ఫుల్ బిజీగా మారాడు. ఇప్పటికే

బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్.. బీటౌన్ డైరెక్టర్ కసరత్తులు.. పండగ చేసుకుంటున్న అభిమానులు..
Rajitha Chanti
|

Updated on: Mar 11, 2021 | 12:27 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫుల్ జోరు మీదున్నాడు. వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువస్తూ.. ఫుల్ బిజీగా మారాడు. ఇప్పటికే ఈ స్టార్ హీరో, జిల్ ఫేం రాధకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన రాధేశ్యామ్ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు రెడీగా ఉంది. ఇదే కాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా చెస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ మూవీ షూటింగ్ జరిగిన సంగతి తెలిసింది. అటు బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. మరో బీటౌన్ హీరో సైఫ్ అలిఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. తాజాగా ప్రభాస్ మరో బీటౌన్ దర్శకుడితో కొత్త సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా ఓ భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తో పాటు హృతిక్ నటించబోతున్నట్లుగా సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారని బీటౌన్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి యశ్ రాజ్ సంస్థ నిర్మాతలు ప్రభాస్ ను సంప్రదించినట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టుకు రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే కాకుండ ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఇటీవలే హృతిక్.. టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ‘వార్’ సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

Also Read:

మహాశివరాత్రి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన వెంకీ.. నయా యంగ్ లుక్కులో అదరగోడుతున్న ‘నారప్ప’..

‘రాధేశ్యామ్’ నుంచి మరో అప్‏డేట్.. మహాశివరాత్రి కానుకగా అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Follow Us
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..