మహాశివరాత్రి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన వెంకీ.. నయా యంగ్ లుక్కులో అదరగోడుతున్న ‘నారప్ప’..

Narappa Movie Update: మహాశివరాత్రి పండగ ఈసారి మరింత సందడిగా మారింది. ఈరోజు ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.

మహాశివరాత్రి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన వెంకీ.. నయా యంగ్ లుక్కులో అదరగోడుతున్న 'నారప్ప'..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 11, 2021 | 12:06 PM

Narappa Movie Update: మహాశివరాత్రి పండగ ఈసారి మరింత సందడిగా మారింది. ఈరోజు ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు తమ అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ.. అభిమానులకు వరుస ట్రీట్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాదేశ్యామ్ నుంచి బ్యూటీఫుల్ పోస్ట్రర్ విడుదల చేశాడు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన అప్ కమింగ్ మూవీ నారప్ప నుంచి మరో పోస్టర్ ను మహాశివరాత్రి కానుగా విడుదల చేసాడు.

వెంకటేశ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ నారప్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్లో వెంకీ యంగ్ లుక్ లో సూపర్ అనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలోని వెంకీ ప్లాష్ బ్యాక్ పోస్టర్ అయ్యుంటుందని అనిపిస్తుంది. దళితులకు, కమ్మ కులస్థులకు మధ్య జరిగన ఘర్షణ నేపథ్యంలో మలయాళం మూవీ అసురన్ తెరకెక్కించారు. ఇక అదే నేపథ్యంలో నారప్ప కూడా డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమానే కాకుండా వంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 3 మూవీ, దృశ్యం 2 మూవీ చేస్తున్నాడు. నారప్ప సినిమాను సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. వెంకీ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు.

Also Read:

‘రాధేశ్యామ్’ నుంచి మరో అప్‏డేట్.. మహాశివరాత్రి కానుకగా అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Jati Ratnalu Movie: ‘జాతి రత్నాలు’ ట్విట్టర్ రివ్యూ: హిట్టు బొమ్మ.. కామెడీ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ లోడింగ్.!

Payal Rajput : సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోస్‌‌‌‌‌తో కవ్విస్తున్న పాయల్.. అమ్మడి అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు