‘రాధేశ్యామ్’ నుంచి మరో అప్‏డేట్.. మహాశివరాత్రి కానుకగా అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Radheshyam Movie Update:  రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రాధేశ్యామ్'. ఇందులో ప్రభాస్ కు

'రాధేశ్యామ్' నుంచి మరో అప్‏డేట్.. మహాశివరాత్రి కానుకగా అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 11, 2021 | 11:43 AM

Radheshyam Movie Update:  రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుంది చిత్రయూనిట్.

తాజాగా మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ నుంచి మరో అందమైన పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో వ్యతిరేక దిశల్లో పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఐదుబాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావడం ఆలస్యమవుతుండడంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాను కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ మరోసారి రొమాంటిక్ పాత్రలో కనించబోతున్నాడు.

Also Read:

Prabhas Adipurush : ప్రభాస్ కు తమ్ముడిగా బాలీవుడ్ యంగ్ హీరో.. ‘ఆదిపురుష్’ లో లక్ష్మణుడిగా నటించే లక్కీహీరో అతడేనా..?

Divyansha Kaushik : మరో తెలుగు సినిమాలో నటించనున్న మజిలీ భామ.. ఆ యంగ్ హీరోకు జోడీగా దివ్యాన్ష కౌశిక్