AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier : తెలుగులో ఒకటి హిందీలో మరొకటి… ఆ రెండు సినిమాల పైనే ఈ అమ్మడి ఆశలు..

ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్‌ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్‌ లవ్‌’

Priya Prakash Varrier : తెలుగులో ఒకటి హిందీలో మరొకటి... ఆ రెండు సినిమాల పైనే ఈ అమ్మడి ఆశలు..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Mar 11, 2021 | 11:41 AM

Share

Priya Prakash Varrier : ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్‌ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్‌ లవ్‌’ సినిమాలోని సెకన్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇక ఈ వీడియో వైరల్‌ అయిన తర్వాత ప్రియాకు సినిమా అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రియా మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. తెలుగులో ఎప్పటి నుంచో అవకాశాలు వస్తోన్నా.. ఇటీవల నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘చెక్‌’ సినిమాకు ఓకే చెప్పిందీ బ్యూటీ.

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. హిందీలో ఓ సినిమా తెలుగులో ఓ సినిమా చేస్తుంది ఈ చిన్నది. బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా అనే సినిమా చేసింది ప్రియా అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత విడుదలకు అనుకోని చిక్కులు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ పైన క్లారిటీ రాలేదు. ఇక తెలుగులో ఇటీవల నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ప్రియా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేక పోయింది. ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ఇష్క్ అనే సినిమా చేస్తుంది. ఇప్పుడు హిందీ శ్రీదేవి బంగ్లా, t తెలుగు ఇష్క్ ఈ రెండు సినిమాలు తప్ప ప్రియా చేతిలో మరో సినిమా లేదు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ప్రియకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది . లేకుంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu – SS Rajamouli : ఆ విషయంలో రాజమౌళి వెనకడుగు వేస్తుంటే.. మహేష్ ముందడుగు వేస్తున్నాడట.. అసలు విషయం ఏంటంటే..

Paagal Movie : ప్రేమ కోసం పరితపించే ‘పాగల్’.. ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ మూవీ టైటిల్ సాంగ్