AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మహేష్, రాజమౌళి సినిమాలో ఆదిపురుష్ హనుమంతుడు.. ఆ పాత్రకోసమేనా..

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. 

Mahesh Babu : మహేష్, రాజమౌళి సినిమాలో ఆదిపురుష్ హనుమంతుడు.. ఆ పాత్రకోసమేనా..
Rajamouli
Rajeev Rayala
|

Updated on: May 28, 2024 | 4:14 PM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో దేశంమొత్తం తనవైపు చేసేలా చేసిన రాజమౌళి. ఆతర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాతో ఆస్కార్ వేదిక పై తెలుగు సినిమా నిలబడింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమానుంచి ఒక్క అప్డేట్ అయినా రాకపోతుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ మరాఠీ నటుడు దేవదత్తా నాగేతో మహేష్ బాబు రాజమౌళి సినిమాలో జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తోంది. దేవదత్తా నాగే ఈ సినిమాలో విలన్ గా నటిస్తాడా లేకా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. దేవదత్తా నాగే టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే..  ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష’లో దేవదత్తా నాగే ఆంజనేయుడిగా నటించారు. ఆదిపురుష్ సినిమా ఎలా ఉన్నప్పటికీ హనుమంతుడి పాత్రలో నటించిన దేవదత్తా నాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ పాత్రతో అతని పాపులారిటీ పెరిగింది.

రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. దీనిని తాత్కాలికంగా ‘SSMB 29’ అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో ఎవరు నటిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ ఫొటోను దేవదత్త నాగే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళిని కలిసిన ఈ క్షణం చాలా ప్రత్యేకమైనదని ఆయన రాసుకొచ్చారు. కారణం లేకుండా రాజమౌళి ఆయనను కలిసి ఉండరు అని అభిమానులు అంటున్నారు. వీలయినంత త్వరగా దీనికి సంబంధించిన న్యూస్ బయటకు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రాజమౌళి ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక మహేష్ ఈ సినిమాకోసం నయా లుక్ లో కనిపించనున్నారు. అలాగే బాడీ కూడా బిల్డ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.