Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar: స్టార్ డైరెక్టర్‌ను వెంటాడుతున్న వివాదాలు.. ఇప్పుడు మరొకటి కూడా..

ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు కేరాఫ్‌గా ఉన్న గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌... ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఒకటి రెండూ కాదు వరుస పెట్టి ఏదో ఒక వివాదం

Shankar: స్టార్ డైరెక్టర్‌ను వెంటాడుతున్న వివాదాలు.. ఇప్పుడు మరొకటి కూడా..
Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 9:44 PM

Shankar: ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు కేరాఫ్‌గా ఉన్న గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌.. ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఒకటి రెండూ కాదు వరుస పెట్టి ఏదో ఒక వివాదం శంకర్‌ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 మూవీ గొడవ ఇంకా ఎటూ తేలలేదు. ఈ లోగా అన్నియన్‌ రీమేక్‌ కూడా చిక్కుల్లో పడింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో వివాదం ఆయనను చుట్టుముట్టింది. కొద్ది రోజులుగా డైరెక్టర్ శంకర్‌ ముందు వివాదాలు క్యూ కడుతున్నాయి. వరుస ఫ్లాప్‌లు ఆ తరువాత వరుస వివాదాలతో ఈ గ్రేట్‌ డైరెక్టర్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఐ, రోబో 2 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తరువాత గ్రాండ్‌గా ప్రారంభమైన ఇండియన్‌ 2.. షూటింగ్ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది.

రీసెంట్‌గా రామ్‌చరణ్‌తో ప్యాన్ ఇండియా సినిమా ఎనౌన్స్‌ చేసిన శంకర్‌కు డే వన్‌ నుంచి ఇబ్బందులు తప్పటం లేదు. తాజాగా ఈ సినిమా కథ నాదే అంటూ తమిళ రచయిత సెల్లముత్తు, రైటర్స్ అసోసియేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. కార్తీక్‌ సుబ్బరాజుతో కలిసి తాను రెడీ చేసిన కథనే ఇప్పుడు చెర్రీ హీరోగా శంకర్‌ తీస్తున్నారన్నది ఈ రైటర్ చేస్తున్న ఎలిగేషన్‌. అసలు ఈ సినిమా ఎనౌన్స్‌ చేసిన దగ్గర నుంచే వివాదాలు మొదలయ్యాయి. ఇండియన్ 2 పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా ఎలా స్టార్ట్ చేస్తారు అంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది లైకా సంస్థ. అయితే ఈ విషయంలో కోర్టు తీర్పు మాత్రం శంకర్‌కు అనుకూలంగానే వచ్చింది. ఈ వివాదాలు కొనసాగుతుండగానే అన్నియన్‌ హిందీ రీమేక్‌ను కూడా ఎనౌన్స్ చేశారు శంకర్‌. అయితే ప్రకటన కూడా కాంట్రవర్సీకి కారణమైంది. నన్న సంప్రదించకుండానే అన్నియన్‌ రీమేక్‌ను ఎనౌన్స్ చేశారంటున్నారు ఒరిజినల్ వర్షన్‌ ప్రొడ్యూసర్‌ ఆస్కార్ రవిచంద్రన్. ఇన్ని వివాదాలతో సతమతమవుతున్న శంకర్‌.. చెర్రీ సినిమాను ఎలా పట్టాలెక్కిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nithiin: వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న నితిన్.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా..

Liger Movie: తిరిగి పట్టాలెక్కిన పూరి సినిమా.. లైగర్ షూటింగ్ కోసం గోవా వెళ్లనున్న చిత్రయూనిట్..

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?