AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandeep Raj: ఈసారికి వదిలేయండి.. మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్.. ఏమైందంటే?

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు సందీప్ రాజ్. కలర్ ఫొటో సినిమాతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సుమ కనకాల కుమారుడితో మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇంతలోనే అనవసరంగా చిక్కుల్లో పడ్డాడు సందీప్ రాజ్.

Sandeep Raj: ఈసారికి వదిలేయండి.. మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్.. ఏమైందంటే?
Sandeep Raj
Basha Shek
|

Updated on: Jul 06, 2025 | 3:53 PM

Share

కలర్‌ ఫొటో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. ప్రస్తుతం సుమ కనకాల కుమారుడితో మోగ్లీ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. అయితే సందీప్ రాజ్ ఈ మధ్యన నటనతో కూడా మెప్పిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఏఐఆర్- ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సిరీస్ లోని ఓ సన్నివేశంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈటీవీ విన్ సంస్థ వివరణ ఇచ్చింది. తాజాగా ఇదే విషయంపై సందీప్‌ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.

‘డియర్ బ్రదర్స్.. 2025 ఏడాదిని ఎంతో గొప్పగా ప్రారంభించాను. డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో నాకు లభించిన ప్రేమ, మరింత కష్టపడేందుకు నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తుల నుంచి కోపం, ద్వేషాన్ని చూడడం నా మనసును కలిచివేస్తోంది. జనవరిలో మీ ప్రేమాభిమానాలకు నేను అర్హుడినో కాదో తెలియదు.. కానీ జూలైలో వస్తోన్న ఈ ద్వేషానికి అర్హుడనా? అంటే స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. నేను ఈ విషయాలను కప్పిపుచ్చడానికి, మేము చేసిన దానికి సమర్థించడానికి ఇక్కడ లేను. ఎల్లప్పుడూ ప్రేక్షకులే కరెక్ట్‌ అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే ఒక చిత్రనిర్మాతగా నమ్ముతాను. ఆ కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే అందులో భాగమైనందుకు చాలా చింతిస్తున్నాను. నాకు ఎవరిపై కోపం, ద్వేషం లేదు. ఎవరినీ లక్ష్యంగా కూడా చేసుకోలేదు. మిమల్ని ఇబ్బందిపెట్టిన ఆ సీన్‌ను ఇప్పటికే తొలగించాం

ఇవి కూడా చదవండి

ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో ఇలాంటి తప్పులు చేస్తారు. ఇప్పుడు నేను కూడా అదే చేశాను. అయితే వెంటనే దానిని సరిదిద్దుకున్నాను. ఇలాంటివీ మళ్లీ చేసే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు. ఇప్పటి నుంచి కంటెంట్‌ విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నా..ఈ వారాంతంలో మీ మనస్సులను బాధపెట్టినందుకు క్షమించండి. ఈ సారికి వదిలేయ్ అన్నా… నిన్ను నొప్పించాలి అని చేయలేదు’ అని మా టీమ్ తరఫున మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా’ అని ట్వీట్ లో రాసుకొచ్చాడు సందీప్ రాజ్.

సందీప్ రాజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..