రిస్క్ చేసిన కుబేర ప్రొడ్యూసర్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే
ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ చూడటానికి సాదా సీదాగా ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్టు గబుక్కున మాట్లాడేస్తారు. కానీ నైజాం ఏరియాలో మాత్రం తిరుగులేని డిస్ట్రిబ్యూటర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. అలాంటి ఆయన కుబేరా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సినిమాను ఒక జూదంలానే చూస్తున్నట్టు ఉన్నాడు. అందుకే రిస్క్ చేసి మరి కూలీ తెలుగు రైట్స్ ను ఏకంగా 100 కోట్లకు దక్కించుకున్నాడు.
ఇక చాన్నాళ్ల తర్వాత కూలీతో మళ్ళీ డబ్బింగ్ సినిమాలకు ఊపుఎక్కించేలా కనిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు. పైగా లోకేష్ గత సినిమాలు తెలుగులోను హిట్ అవ్వడంతో బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులకు తెరతీస్తున్నాడు కూలీ. జైలర్ తో రజినీ కూడా ఫామ్ లోకి వచ్చాడు. 2023లో విడుదలైన ఈ చిత్రం 12 కోట్ల బిజినెస్ చేస్తే 45 కోట్ల వరకు షేర్ వసూళ్లు చేసింది. మధ్యలో వెట్రిమన్ ఫ్లాప్ అయినా కూలీకి డిమాండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. పైగా కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగ్ విలన్ గా నటిస్తున్నారు. దీంతో కూలీ తెలుగు రైట్స్ ను ఏష్యన్ సునీల్ నారంగ్ ఏకంగా 52 కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది. దీంతో 100 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే కూలీ తెలుగులో సేఫ్ గా గట్టెక్కే ఛాన్స్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఒకే ఒక్క సినిమా కేజిఎఫ్ 2. 2022లో వచ్చిన ఈ చిత్రం 138 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీని తర్వాత జైలర్ 83 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మరి ఈ రెండు సినిమాలను మించి కూలీ కలెక్షన్లను సాధిస్తుందా? లేదా ప్రొడ్యూసర్ ను కోల్పోలేని దెబ్బ కొడుతుందా తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Heart Attack: ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట
సైక్లింగ్ మంచిదా.. రన్నింగ్ మంచిదా.. విస్తు పోయే నిజాలు
ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!
ఫ్రిజ్‌లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్
ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? అయితే, ఈ పది రకాల ఆహార పదార్థాలు మీ కోసమే

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
