ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? అయితే, ఈ పది రకాల ఆహార పదార్థాలు మీ కోసమే
మన శరీరంలోనే అతి పెద్ద అవయవం కాలేయం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శక్తిని నిల్వ చేయడానికి, అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మందికి 'ఫ్యాటీ లివర్' సమస్య వస్తోంది. జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మందిలో కనిపిస్తోంది.
ఈ సంఖ్య పెరుగుతున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే, ఈ సమస్యపై అవగాహన పెంచడం, ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మెరుగుపరుచుకోవడం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి జూన్ 26న పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో 10 సాధారణ ఆహార పదార్థాలను సూచించారు. ‘ఫ్యాటీ లివర్’ తో బాధపడుతున్న వారు ఆ ఆహార పదార్థాలు తీసుకుంటే మేలని సూచించారు. అంతే కాకుండా వాటికి 1 నుండి 10 స్కేల్‌లో ర్యాంక్ కూడా ఇచ్చారు. మీకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే ఏ ఆహారాలు ప్రమాదకరమో, ఏవి మంచివో తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జాబితా సహాయపడుతుంది. గ్రీన్ టీ, స్మూతీస్, బెర్రీస్, చియా లేదా తులసి గింజలు, బీట్‌రూట్, బాగా పండిన అరటిపండు, తాజా పండ్ల రసం, అవకాడో, స్టోర్లలో కొన్న పండ్ల రసం, బ్లాక్ కాఫీ వంటి ఆహార పదార్థాలను సౌరబ్ సేథీ సూచించారు. ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది ప్రధానంగా రెండు రకాలు. ఒకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌పై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ సమస్య ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో గుర్తించారు. ఊబకాయం ఉన్నవారు, మధ్య వయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో, పిల్లల్లో కూడా ఇది రావచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో, అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. మెటబాలిక్ సిండ్రోమ్ వంటి కొన్ని జీవక్రియ సంబంధిత రుగ్మతలు ఉన్నవారు వేగంగా బరువు తగ్గినట్లయితే అనుమానించాల్సిందే. హెపటైటిస్ సి వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు సోకినవారిలో, కొన్ని రకాల విష పదార్థాలకు గురైనవారిలో ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
