Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన నిద్రను శాసించేది ఇవే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

మన నిద్రను శాసించేది ఇవే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

Phani CH
|

Updated on: Jul 06, 2025 | 2:51 PM

Share

మన నిద్ర అలవాట్లపై కేవలం వ్యక్తిగత జీవనశైలే కాకుండా, మనం నివసించే ప్రాంతం, అక్కడి వాతావరణం, రుతువులు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. వారంలోని రోజులు, కాలాలను బట్టి నిద్రపోయే సమయం, వ్యవధి గణనీయంగా మారుతున్నట్టు ఈ పరిశోధనలో స్పష్టమైంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు.

ఇందుకోసం వారు ప్రపంచవ్యాప్తంగా 1,16,000 మంది వయోజనుల నుంచి సుమారు 7.3 కోట్ల రాత్రుల నిద్రకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. మూడున్నరేళ్ల పాటు పరుపు కింద అమర్చే ఒక ప్రత్యేక పరికరం సహాయంతో ఈ డేటాను సేకరించారు. పగటి వెలుగు, ఉష్ణోగ్రత, వారపు దినచర్యలు వంటి పర్యావరణ అంశాలు మానవుల నిద్రను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మానవుల నిద్రపై రుతువుల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో తమ పరిశోధన స్పష్టం చేస్తోందని, భౌగోళిక పరిస్థితులు, జనాభా కూడా నిద్రను ప్రభావితం చేస్తాయని, ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన నిద్ర ఆరోగ్య నిపుణురాలు హన్నా స్కాట్ తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం ఉత్తరార్ధగోళంలో నివసించే ప్రజలు శీతాకాలంలో సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోతుండగా, దక్షిణార్ధగోళంలోని వారు వేసవిలో తక్కువ సమయం నిద్రపోతున్నారు. భూమధ్య రేఖకు ఎంత దూరంగా నివసిస్తే, వారి నిద్రలో రుతువులను బట్టి అంత ఎక్కువ వ్యత్యాసం కనిపించడం ఆసక్తికరమైన విషయం” అని హన్నా స్కాట్ పేర్కొన్నారు. అంతేకాకుండా, చాలామంది వారాంతాల్లో ఆలస్యంగా నిద్రలేచి, వారంలో కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తేలింది. ముఖ్యంగా ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునే మధ్య వయస్కులలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఇలా అస్తవ్యస్తంగా నిద్రపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, 2020 నుంచి 2023 మధ్య కాలంలో ప్రజల నిద్ర సమయం క్రమంగా తగ్గుతూ వస్తున్నట్టు అధ్యయనం గుర్తించింది. సగటున ప్రతి రాత్రి నిద్ర 2.5 నిమిషాల చొప్పున తగ్గినట్టు వెల్లడైంది. దీనికి కొవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలు ఒక కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అస్తవ్యస్తమైన నిద్ర కేవలం అలసట కలిగించడమే కాకుండా, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని, మన పరిసరాలు, దినచర్యలు నిద్రను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా దానిని మెరుగుపరుచుకోవచ్చని, ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన డానీ ఎకెర్ట్ వివరించారు. ఈ అధ్యయనం టెక్నాలజీ ఎక్కువగా వాడేవారిపై దృష్టి సారించినప్పటికీ, పర్యావరణ అంశాలు నిద్రపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నితిన్ ఖాతాలో హిట్ పడిందా.. లేదా.. తెలియాలంటే వీడియో చూసేయండి మరి

డిఫరెంట్‌ పాత్రలో కీర్తి సురేశ్‌ ఆకట్టుకుందా ?? ఉప్పు కప్పురంబు రివ్యూ

3BHK Review: సిద్ధార్థ్‌ 3BHK రివ్యూ.. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా

ఆగస్ట్ 1 తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాలను.. OTTల్లో చూడలేరు..

స్పూన్‌ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..