నితిన్ ఖాతాలో హిట్ పడిందా.. లేదా.. తెలియాలంటే వీడియో చూసేయండి మరి
నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు. వకీల్ సాబ్ తర్వాత వేణు తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది. ఫెయిల్యూర్స్‌లో ఉన్న నితిన్‌ను.. ఈ సినిమా గట్టెక్కించా లేదా? అనేది తెలియాలంటే వాచ్ మై రివ్యూ..
జై అలియాస్ నితిన్ ఒక ఆర్చర్.. చిన్నప్పటి నుంచి కష్టపడి విలువిద్యలో శిక్షణ తీసుకుంటాడు. ఎలాగైనా దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనేది జై కల. కానీ బుల్స్ ఐ కొట్టడంలో ప్రతిసారి మిస్ అవుతూ ఉంటాడు. మీలో ఏదో సమస్య ఉంది.. ముందుగానే పరిష్కరించుకున్న తర్వాత లక్ష్యం వైపు ఆలోచించు అని కోచ్ చెప్పిన మాటలు విన్న తర్వాత.. పరిష్కారం కోసం బయలుదేరుతాడు జై. అలా తన అక్క ఝాన్సీ అలియాస్ లయకు చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. దాంతో అక్క దగ్గరికి బయలుదేరుతాడు తమ్ముడు. అతను వెళ్లేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకొని.. ఆమెకు ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని కూడా ఫణంగా పెడతాడు. ఆ తర్వాత జై ఏం చేశాడు. ఎవరితో పోరాడాడు. అనేది తెలుసుకోవాలంటే ఈసినిమా చూసేయాల్సిందే! సింగిల్ లైన్లో చెప్పాలంటే.. అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్లి ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. మనిషిపోయి మాట బతికితే మనిషి బతికినట్టే.. అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే అనేది ఈ సినిమా లైన్. సింపుల్గా మూడే ముక్కల్లో చెప్పాలంటే ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ తో తప్పుడు సంతకాల కోసం విలన్ ఆడే ఒక క్రూర నాటకం ఈ సినిమా. ఆ సిన్సియర్ ఆఫీసర్ తమ్ముడు హీరో. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా కథ. వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తున్న కూడా స్క్రీన్ ప్లే వైస్ గా మ్యాజిక్ చేయాలి అనుకున్నాడు వేణు శ్రీరామ్. కానీ అది అసలు కుదరలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే డైరెక్టర్ ప్రయత్నం గాడితప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్ ఆకట్టుకుందా ?? ఉప్పు కప్పురంబు రివ్యూ
3BHK Review: సిద్ధార్థ్ 3BHK రివ్యూ.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా
ఆగస్ట్ 1 తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాలను.. OTTల్లో చూడలేరు..
స్పూన్ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..
ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
