గర్భస్రావం తర్వాత జుట్టు రాలుతోందా ?? తగ్గించాలంటే ??
జుట్టు పొడుగ్గా, ఆరోగ్యంగా ఉంటే మనం అందంగా కనిపిస్తాం. ఆత్మవిశ్వాసంతో మెలుగుతాం. అయితే ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇలా పట్టుకుంటే అలా విపరీతంగా రాలిపోతుంటుంది. సాధారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, కాన్పు తరువాత, ముట్లుడిగిన తరువాత, జుట్టు రాలడం జరుగుతుంది.
అలాగే గర్భస్రావం లేదా అబార్షన్ అయిన మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇందుకు అబార్షన్ మహిళలను మానసికంగా కుంగదీయడమే కారణం అంటున్నారు నిపుణులు. మనో వ్యాకులతను తగ్గించుకోవడానికి ధ్యానం వంటివి ప్రయత్నించాలి. వెంట్రుకలు రాలడానికి కారణమయ్యే మానసిక ఒత్తిడిని యోగా వ్యాయామాలతో దూరం చేయవచ్చు. అంతేకాకుండా ఐరన్, బయోటిన్ వంటివి శరీరానికి అందుతున్నాయా చూడాలని రోజువారీ ఆహారంలో గుడ్డు, సోయా, పనీర్, ఆకుకూరలు, చేప, నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలని, వీటి వల్ల కావాల్సిన పోషకాలూ అందుతాయని అంటున్నారు. జుట్టు కుదుళ్లకు పోషణ అందేలా కొబ్బరినూనెతో వారానికి రెండు సార్లు మసాజ్ చేయాలి. తలస్నానం చేసే సమయంలో చాలా వేడిగా ఉన్న నీరు ఉపయోగించకూడదు. మాడుపై సహజసిద్దంగా ఉండే నూనెలు వేడికి పొడి బారే అవకాశాలున్నాయి కాబట్టి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. సాధారణంగా వెంట్రుకలు కొంత కాలం పెరుగుతాయి, కొంత కాలం అలాగే ఉంటాయి, కొంత కాలం రాలుతాయి తరువాత తిరిగి పెరుగుతాయి. ఈ దశలలో మార్పులు కలిగినపుడు జుట్టురాలే దశ ఎక్కువ కాలం కనిపిస్తుంది. ఈ జుట్టు రాలే దశ 3 వారాల నుంచి 3 నెలల వరకు కొనసాగవచ్చు. దీన్ని మనం గుర్తించటానికి 6 వారాల నుంచి 3 నెలలు పట్టవచ్చు. శరీరంలో చాలా వేగంగా పెరిగే కణాలలో కేశాలు ఒకటి. అందువల్ల వీటికి ఎక్కువ పోషణ అవసరం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలే సమస్య తగ్గకపోతే చర్మ నిపుణులను సంప్రదించాలి. ఇక్కడ మేం మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేం ఈ సమాచారాన్ని అందించాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
