Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!

ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!

Phani CH
|

Updated on: Jul 06, 2025 | 3:17 PM

Share

ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరమైనా వెళతారు కొందరు ప్రేమికులు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తన ప్రియురాలు అడిగిన ఫుడ్‌ కోసం, అందులో వేసేందుకు అవసరమైన ఓ చిన్న వస్తువు కోసం ఏకంగా దేశాలు దాటి వెళ్లి తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కేవలం కరివేపాకు కోసం ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన ఈ పని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వేద్ క్యాంప్‌బెల్ మ్యాడిసన్ అనే కంటెంట్ క్రియేటర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది. అతని ప్రియురాలు తనకు ‘కాందా పోహా’ (ఉల్లిపాయ అటుకుల ఉప్మా) తినాలని ఉందని, కానీ అందులోకి కచ్చితంగా కరివేపాకు కావాలని అడిగింది. ప్రియురాలి కోరిక తీర్చాలనుకున్న వేద్, వెంటనే కరివేపాకు తీసుకురావడానికి బయలుదేరాడు.అయితే, అతను దగ్గరలో ఉన్న ఏ దుకాణానికో వెళ్తే సరిపోయేది. మరి అక్కడ అలాంటి దుకాణాలు లేవో.. ఉన్నా అక్కడ కరివేపాకు దొరకలేదో కానీ, ఏకంగా రాత్రికి రాత్రే విమానం ఎక్కి విదేశాల నుంచి ముంబైకి చేరుకున్నాడు. అక్కడితో ఆగకుండా, ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి, ప్రయాణికులతో మాట్లాడుతూ, వారి లగేజీ మోయడంలో సహాయం చేస్తూ స్థానిక మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ తాజా కరివేపాకు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి, గొప్ప విజయం సాధించినవాడిలా ఆనందపడిపోతూ.. మళ్లీ విమానం ఎక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లాక, ఇద్దరూ కలిసి వంట మొదలుపెట్టారు. కూరగాయ ముక్కలతో పాటు ఎంతో కష్టపడి తెచ్చిన కరివేపాకును కూడా వేసి కాందా పోహా తయారుచేసుకున్నారు. ఎంతో హ్యాపీగా వంట పూర్తిచేసుకున్న ఆ ప్రేమికులు అంతే ఇష్టంగా దానిని ఆరగించారు. కాగా ఈ ప్రేమ జంట యూకేకు చెందినవారుగా తెలుస్తోంది. ప్రియురాలి కోరిక మేరకు కరివేపాకు కోసం యూకే నుంచి భారత్‌ కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘కాందా పోహా ప్రిన్సెస్ పార్ట్ వన్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.9 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ప్రియురాలి కోసం వేద్ పడిన కష్టాన్ని, అతని ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “నిజంగా ప్రేమ ఉంటే అబ్బాయిలు ఏదైనా చేస్తారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ రకరకాల కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తూ, అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రిజ్‌‌లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్‌

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందా? అయితే, ఈ పది రకాల ఆహార పదార్థాలు మీ కోసమే

గర్భస్రావం తర్వాత జుట్టు రాలుతోందా ?? తగ్గించాలంటే ??

మన నిద్రను శాసించేది ఇవే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు