Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఫ్యాన్స్ కాదమ్మా.. డై హార్డ్ ఫ్యాన్స్.. ప్రభాస్ కోసం పంజాబ్ అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ కామెడీ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి ప్రసాద్ లు ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Prabhas: ఫ్యాన్స్ కాదమ్మా.. డై హార్డ్ ఫ్యాన్స్.. ప్రభాస్ కోసం పంజాబ్ అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్
Prabhas
Basha Shek
|

Updated on: Jul 06, 2025 | 3:42 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి, అతని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా, నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్ కు క్రేజ్ ఉంది. చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఇప్పుడు ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో పంజాబ్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో హైవేని ఆనుకొని ఉన్న గోడంతా కూడా ప్రభాస్ సినిమా పోస్టర్లతో నిండిపోయింది. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ‘ఈశ్వర్’ మొదలుకొని బాహుబలి 2 వరకు అన్ని సినిమాల పోస్టర్లను ఒక ఆర్డర్లో అతికించి పంజాబ్ అభిమానులు డార్లింగ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ పోస్టర్లన్సీ తెలుగులోనే ఉండడం గమనార్హం.

ప్రభాస్ నటించిన చాలా సినిమాలు హిందీలో రిలీజ్ కాలేదు. బాహుబలి నుంచే ఆయన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే పంజాబ్ లో మాత్రం మొదటి సినిమా ఈశ్వర్ నుంచి పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై ‘ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పంజాబ్’ అని కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది. దీనిని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ పోస్టర్స్ ఇప్పుడు వేసినవి కాదు.. 2018 లో వేసినవి. కానీ ప్రభాస్ అభిమానులు మళ్లీ ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ లో ప్రభాస్ సినిమా పోస్టర్లు.. వీడియో ఇదిగో..

కాగా ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ తో పాటు మరో అరడజను ప్రాజెక్టులున్నాయి. హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తోనూ ఓ మూవీ చేయాల్సి ఉంది. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 ప్రాజెక్టులు కూడా డార్లింగ్ పూర్తి చేయాల్సి ఉంది.

ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..