Satya Movie: ఆర్జీవీ సూపర్ హిట్ సత్య రీరిలీజ్.. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో సత్య ఒకటి. ముంబై మాఫియా అండర్ వరల్డ్ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ డ్రామాలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‍పేయ్, ఊర్మిళ మతోంద్కర్, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. 1998లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది.

Satya Movie: ఆర్జీవీ సూపర్ హిట్ సత్య రీరిలీజ్.. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే..
Satya Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2025 | 7:06 AM

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ తెగ నడిచిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. 4k వెర్షన్స్‎లో రిలీజ్ అయిన ఒకప్పటి చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, వెంకటేశ్, సిద్ధార్థ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల హిట్ మూవీస్ మరోసారి థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ కానుంది. అదే సత్య. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో వర్మ టేకింగ్, ఫిల్మ్ మేకింగ్ చూసి సినీ క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపోయారు.

ఎప్పటికప్పుడు కొత్తదనంతో చిత్రాలను తెరకెక్కించి భారీ విజయాలను అందుకున్నారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆర్జీవీ తెరకెక్కించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అందులో సత్య ఒకటి. 1998లో విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్స్ క్రైమ్ మూవీ అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోస్ లేకున్నా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రాబోతుంది. జనవరి 17న ఈ సినిమాను మళ్లీ రీరిలీజ్ చేయనున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలకాబోతుంది. దీంతో ఈ సినిమా మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.

ముంబై మాఫియా అండర్ వరల్డ్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్ పేయ్, ఊర్మిళ మతోంద్కర్, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో పెద్దగా స్టార్ డమ్ లేని చిన్న నటీనటులతోనే ఈ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు ఆర్జీవీ. ఈ చిత్రానికి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ కథ అందించగా.. ఆర్జీవీ దర్శకత్వం వహించారు. అప్పట్లో రూ.2.5 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే రూ.15 కోట్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.