Vishal: ఆస్పత్రిలో చేరిన విశాల్.. హెల్త్ బులెటిన్ రిలీజ్.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే జరిగిన తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ బాగా బక్కచిక్కిపోయి వణుకిపోతూ కనిపించారు. అలాగే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. దీంతో అతని అభిమానులు తెగ కంగారు పడుతున్నారు.
యాక్షన్ సినిమాలతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ యాక్షన్ హీరోకు భారీగా అభిమానులున్నారు. కాగా ఇటీవల జరిగిన అతని మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. బాగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడీ స్టార్ హీరో. అలాగే వేదికపై వణుకుతూ మాట్లాడారు. దీంతో అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా ఈవెంట్ పూర్తయిన వెంటనే అతను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఈ మేరకు అపోలో ఆస్పత్రి వైద్యులు విశాల్ హెల్త్ బులెటిన్ ను కూడా రిలీజ్ చేశారు. ‘ప్రస్తుతం విశాల్ ఒక వైరల్ ఫీవర్ తో పోరాడుతున్నారు. అతనికి చికిత్స అందిస్తున్నాం. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు విశాల్ లేటెస్ట్ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ విశాల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
కాగా 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ సినిమా మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. సంతానం, సోనూసూద్ కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. కానీ అక్కడ అతనిని చూసి అందరూ షాక్ తిన్నారు. అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రమోషన్స్‌కు హాజరై.. సినిమా పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పిన విశాల్ కమిట్‌మెంట్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతోన్న విశాల్.. వీడియో
Actor #Vishal 🥹❤️❤️
Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja …
— Official CinemaUpdates (@OCinemaupdates) January 5, 2025
Iam feeling very sad about vishal… What happend to him?.. i will pray to god Vishal sir get well soon ur the inspiration to all. come back with a good health we are waiting for ur inspirational speech #GetWellSoon @VffVishal pic.twitter.com/kRUuZs6Uvp
— J.Abhishek Reddy (@AbhishekReddy_4) January 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి