Prashanth Neel: డ్రాగన్ సినిమాకు నీల్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాలా..
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎప్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ సునామీ సృష్టించాయి. ఇక ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నారు.

దేవర తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వార్2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నీల్ రూపొందిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమా విషయంలో ప్రతి అంచనాల ఊహించని లెవల్లో ఉంటుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారని సమాచారం. నీల్, తారక్ కాంబోలో రాబోయే ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని టాక్. ఇప్పటివరకు కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో హీరోల ఎలివేషన్ నీల్ ఏ స్థాయిలో చూపించారో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తారో అని ఊహించనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ఎన్టీఆర్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ కొంత ఫిక్స్ చేసి ఓవరాల్ ప్రాఫిట్ లో 50 శాతం దాకా అడిగాడని.. అందుకు మేకర్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
ఇవి కూడా చదవండి: Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..
ప్రస్తుతం తారక్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సైతం అదే స్థాయిలో వసూలు చేస్తున్నారట. కొన్ని రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..








