AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ పై ట్రోల్స్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ఓంరౌత్..

ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రావణుసురిడిగా నటించిన సైఫ్ పాత్రపై అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. గతంలో వచ్చిన రామాయణం సీరియల్ లోని రావణాసురుడి లుక్ తో..

Adipurush: రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ పై ట్రోల్స్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ఓంరౌత్..
Adipurush, Director Om Raut
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2022 | 1:45 PM

Share

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా… స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణసురుడిగా నటిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మరోవైపు ఈ టీజర్ పై నెట్టింట ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రావణుసురిడిగా నటించిన సైఫ్ పాత్రపై అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. గతంలో వచ్చిన రామాయణం సీరియల్ లోని రావణాసురుడి లుక్ తో.. ఆదిపురుష్ లోని రావణ లుక్ పోల్చుతూ.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ట్రోల్స్ పై స్పందించారు డైరెక్టర్ ఓంరౌత్.

డైరెక్టర్ మాట్లాడుతూ.. ” రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్ తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రావణుడు అంటే పొడవాటి జుట్టు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంతో చూపించేవారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వా్న్ని ఆ విధంగా తెలిపారు. కానీ ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికీ ఈ సినిమా చేరాలని భావిస్తున్నాను. ఈ మూవీతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజేయాలనుకుంటున్నానవు. అందుకే రావణుడి లుక్ అలా డిజైన్ చేశాం.

రావణుడు భయంకరమైన పక్షిపై కూర్చున్నట్లు చూపించాం. కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రాకండి. థియేటర్లో సినిమా చూశాక మాట్లాడంది. సినిమాలో ఎలాంటి లెదర్ దుస్తులు ఉపయోగించలేదు. మమ్మల్ని నమ్మండి ” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్