ఎన్టీఆర్‌ను తిట్టేశా.. ఈ రోజు తారక్ ఆ రేంజ్‌లో ఉన్నాడంటే కారణం ఆమె.. ఆసక్తికర విషయం చెప్పిన డైరెక్టర్
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. తారక్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు, పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అలాగే తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భగా అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఎన్టీఆర్ గురించి ఓ దర్శకుడు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఎదురైన సవాళ్లు, జూనియర్ ఎన్టీఆర్ ను వెండితెరకు పరిచయం చేసిన విధానం, అలాగే షూటింగ్ సమయంలో జరిగిన ఒక గుర్తుండిపోయే సంఘటన గురించి వివరించారు. గుణశేఖర్ తన రెండో సినిమా సొగసు చూడతరమా తరువాత పురాణ నేపథ్యమున్న బాలరామాయణం తీయడానికి సిద్ధమైనప్పుడు, నిర్మాతలకు పలు సందేహాలు కలిగాయట. ఎం.ఎస్.రెడ్డి, కే.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు వంటి అనుభవజ్ఞులైన నిర్మాతలు, ఒక యువ దర్శకుడు (ఆయన వయసులో చాలా చిన్నవారు) ఇంత పెద్ద పురాణ కథను సమర్థవంతంగా తెరకెక్కించగలడా అని ప్రశ్నించారట. శ్యామ్ ప్రసాద్ వంటి వారి సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగిందని తెలిపారు గుణశేఖర్. అయితే తన ఆలోచన, బాలరామాయణాన్ని చిన్న పిల్లలతో తీయాలనేది వారికి నచ్చింది. దీనికి గుణశేఖర్ వాల్మీకి రామాయణాన్ని లోతుగా అధ్యయనం చేసి, తనదైన శైలిలో ఒక ఆర్డర్ ను రాసుకున్నారట.
ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది
అప్పుడు దాదాపు 20 మంది పండితులు, చరిత్రకారుల సమక్షంలో తన కథా వివరణను అందించారట. ఈ తొలి సమావేశంలోనే దర్శకుడి అవగాహన, పాత్రల పట్ల ఆయనకున్న స్పష్టత పండితులకు నమ్మకాన్ని కలిగించాయి. ఇది సినిమా నిర్మాణానికి తొలి అడుగుగా మారిందట. ఆ సమయంలో మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తీయడం అంటే, నేటి తొంభై కోట్ల రూపాయలకు సమానమని గుణశేఖర్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణంతోనే తన సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన సినిమాలోకి రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఎం.ఎస్.రెడ్డి గారు రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తరచుగా అతిథిగా వెళ్లేవారు. అలాంటి ఒక సందర్భంలో, ఎన్టీఆర్ రావు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి ప్రదర్శన ఇవ్వడం ఎం.ఎస్.రెడ్డి గారు చూశారు. ఆయన అసాధారణమైన ప్రతిభను గుర్తించి, గుణశేఖర్ కు జూనియర్ ఎన్టీఆర్ పేరును సూచించారట. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా
జూనియర్ ఎన్టీఆర్ చాలా హైపర్ ఆక్టివ్ గా, ఉత్సాహంగా ఉండే పిల్లవాడు. ఆయన రాముడు పాత్ర కాకుండా హనుమంతుడు పాత్రకు సరిపోయేంత చురుకుదనం ఉండేదని గుణశేఖర్ చమత్కరించారు. శివ ధనుస్సును విరగొట్టే సన్నివేశం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ధనుస్సును, షాట్ ప్రారంభం కాకముందే ప్రాక్టీస్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అనుకోకుండా విరిచేశాడు. ఆ ధనుస్సు ఒకే ఒక్కటి కావడంతో, ఆ రోజు షూటింగ్ ఆగిపోయింది. దీనితో గుణశేఖర్ తీవ్ర ఆగ్రహానికి గురై, జూనియర్ ఎన్టీఆర్ ను మందలించారట. ఈ సంఘటన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి దగ్గరికి వెళ్ళగా, ఆమె తన కొడుకును సమర్థించలేదు. బదులుగా, దర్శకుడు చెప్పినది వినాలని, ఆయన తిట్టినా, కొట్టినా అది నీ తప్పు కాబట్టి అంగీకరించాలని చెప్పింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి గొప్ప పెంపకానికి నిదర్శనమని గుణశేఖర్ కొనియాడారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉండటానికి వెనుక తన తల్లి పెంపకం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.




