టాలీవుడ్‌లో మరో విషాదం..! కరోనాతో డైరెక్టర్, రచయిత నంద్యాల రవి కన్నుమూత

Director Nandyala Ravi Died : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు.

టాలీవుడ్‌లో మరో విషాదం..! కరోనాతో డైరెక్టర్, రచయిత నంద్యాల రవి కన్నుమూత
Director Nandyala Ravi Died
Follow us
uppula Raju

|

Updated on: May 14, 2021 | 12:41 PM

Director Nandyala Ravi Died : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు. తాజాగా రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనా కారణంగా ఈరోజు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న సమయంలో హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే… సినీ నటుడు సప్తగిరి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.

పలు చిత్రాలకు నంద్యాల రవి రచయితగా పని చేశారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. సప్తగిరితో ఓ సినిమాను చేసేందుకు కూడా కథను రెడీ చేసుకున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను బలితీసుకుంది. నంద్యాల రవి మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

కాగా ఇటీవల యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్‏లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందారు.

‘కరోనా వైరస్ ఒక జీవి.. దానికి కూడా బతికే హక్కు ఉంది’ వింత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Rajesh Agrawal: లండన్‌లో భారత సంతతి వ్యక్తికి మరో అవకాశం.. డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా పారిశ్రామికవేత్త రాజేష్

Rain Alert: పొంచి ఉన్న అల్పపీడనం ముప్పు.. తెలంగాణలో మూడు రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు.!!

ఎముకల బలం కోసం ఈ ఐదు ఆహారాలు సూపర్..! కాల్షియం విపరీతంగా ఉంటుంది.. మీరు ట్రై చేయండి..