Rain Alert: పొంచి ఉన్న అల్పపీడనం ముప్పు.. తెలంగాణలో మూడు రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు.!!

Rain Alert In Telangana: తెలంగాణకు అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం...

Rain Alert: పొంచి ఉన్న అల్పపీడనం ముప్పు.. తెలంగాణలో మూడు రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు.!!
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2021 | 11:29 AM

Rain Alert In Telangana: తెలంగాణకు అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాగల మూడురోజులు అక్కడక్కడ ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడా వడగండ్లు పడే ఛాన్స్‌ ఉందని పేర్కొంది.

ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్య ట్రోపో స్ఫేయార్ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం 16వ తేదీ నాటికి మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని పేర్కొంది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయిని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి మి వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!