ఎముకల బలం కోసం ఈ ఐదు ఆహారాలు సూపర్..! కాల్షియం విపరీతంగా ఉంటుంది.. మీరు ట్రై చేయండి..

These Five Foods : కాల్షియం, విటమిన్ డి మీ శరీరానికి శక్తినిచ్చి సరిగ్గా పనిచేసే రెండు ఖనిజాలు. మీ ఎముకలు చాలా పెలుసుగా లేదా

ఎముకల బలం కోసం ఈ ఐదు ఆహారాలు సూపర్..!  కాల్షియం విపరీతంగా ఉంటుంది.. మీరు ట్రై చేయండి..
Calcium

These Five Foods : కాల్షియం, విటమిన్ డి మీ శరీరానికి శక్తినిచ్చి సరిగ్గా పనిచేసే రెండు ఖనిజాలు. మీ ఎముకలు చాలా పెలుసుగా లేదా బలహీనంగా మారకుండా ఉండటానికి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం సరిగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. ఇది విటమిన్ డి ద్వారా లభిస్తుంది. ఎముకలలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారతాయి. సులభంగా విరిగిపోతాయి. పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎముక ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.

1. జున్ను
పాల నుంచి వచ్చే జున్నులో కావలసినంత కాల్షియం దొరుకుతుంది. మొజారెల్లా జున్నులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఫలితాల కోసం మీరు స్కిమ్ మిల్క్‌తో చేసిన జున్ను కూడా ప్రయత్నించవచ్చు.

2. పాలు
ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగితే మీ ఎముకలు బలపడతాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చిన్న వయస్సు నుంచే ఇది బలమైన ఎముకలకు సమర్థవంతమైన వనరుగా పరిగణించబడుతుంది. పిల్లలు ఉదయం, రాత్రి ఒక గ్లాసు వెచ్చని పాలు తాగాలి.

3. గుడ్లు
ఉదయం గుడ్లు తినడం వల్ల విటమిన్ డి దొరుకుతుంది. మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను గుడ్డు అందిస్తుంది. అలాగే మీరు రోజూ ఒక గ్లాసు నారింజ రసం తాగండి.

4. బ్రోకలీ
బ్రోకలీలో విటమిన్ సి దండిగా లభిస్తుంది. ఇంకా ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేస్తుంది. బ్రోకలీలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి.

5. సాల్మన్ చేప
సాల్మన్ ఫిష్ విటమిన్ డి ప్రధాన వనరు. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. సాల్మొన్‌లో ఉండే మృదువైన ఎముకలలో కాల్షియం అధికంగా ఉంటుంది. సాల్మన్ ఫిష్ మీ ఆరోగ్యానికి, ఎముకలకు మంచిది.

Tauktae Red Alert: దూసుకొస్తున్న మరో ముప్పు.. ఈ నెల 16న భారత తీరంను తాకనున్న తౌక్టే..

India Post: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఇందులో చేరితే మీ చేతికి రూ. 7 లక్షలు.. ఈ పోస్టాఫీస్ స్కీమ్ అదుర్స్..

బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ పానీయాల జోలికి వెళ్లొద్దు..! అయినా తాగారో అంతే సంగతులు..