Oy Movie: ఓయ్ సినిమాకు 15 ఏళ్లు.. ఆ క్వశ్చన్ అడిగిన నెటిజన్.. దండం పెట్టేసిన డైరెక్టర్..

గతంలో బాక్సా్‌ఫీస్ వద్ద పరాజయమైన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ నిండిపోయాయి. అంతేకాదు యూత్ నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధార్థ్, షామిలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఓయ్ సినిమా పాటలతో థియటర్లలో జోష్ నెలకొంది. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేళ్లు అవుతుంది.

Oy Movie: ఓయ్ సినిమాకు 15 ఏళ్లు.. ఆ క్వశ్చన్ అడిగిన నెటిజన్.. దండం పెట్టేసిన డైరెక్టర్..
Oy Movie Director
Follow us

|

Updated on: Jul 03, 2024 | 8:00 PM

టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఓయ్ ఒకటి. డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. అప్పట్లో ఈ మూవీ స్టోరీ జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ మ్యూజిక్ పరంగా హిట్ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఓయ్ మూవీ సాంగ్స్ వినిపిస్తుంటాయి. గతంలో బాక్సా్‌ఫీస్ వద్ద పరాజయమైన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ నిండిపోయాయి. అంతేకాదు యూత్ నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధార్థ్, షామిలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఓయ్ సినిమా పాటలతో థియటర్లలో జోష్ నెలకొంది. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేళ్లు అవుతుంది.

ఇక ఇదే విషయాన్ని చెబుతూ తన సంతోషాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ ఆనంద్ రంగా. ఓయ్ విడుదలై నేటికి పదిహేనేళ్లు అంటూ ట్వీట్ చేయగా.. నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఓయ్ సినిమాకు సీక్వెల్ తీయమని ఓ నెటిజన్ అడగ్గా.. ఎవరు యాక్ట్ చేస్తారు..? ఎవరు నిర్మిస్తారు..? అని రిటర్న్ క్వశ్చన్ అడిగాడు. అలాగే మళ్లీ ఓయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని మరో నెటిజన్ అడగ్గా.. ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సింపుల్ గా దండం పెట్టేశాడు.

ఓయ్ సినిమా వంటి మంచి సినిమాను మళ్లీ తీయాలని మరో నెటిజన్ అడగ్దా.. తప్పకుండా అంటూ రిప్లై ఇచ్చాడు. సినిమాను వైజాగ్ లో ఎందుకు షూట్ చేశారని అడగ్గా.. తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని అందుకే చేశానని అన్నారు. ఇటీవల ఓయ్ రీరిలీజ్ సందర్భంగా ఓ నెటిజన్ ఇంత మంచి సినిమా తీసి ఎక్కడికిపోయావ్.. గుండు నాయాలా అంటూ మాట్లాడితే లైట్ తీసుకున్నాడు ఆనంద్ రంగా. నిజమే నాది గుంటూ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇవ్వడంతో వెంటనే సదరు నెటిజన్ సారీ చెప్పేశాడు. ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట అభిమానులతో ముచ్చటించాడు ఆనంద్ రంగా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు