Pawan Kalyan: సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఇక పై పవన్ నిర్ణయం అదే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో పర్యటించారు. పవన్‏కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి పరిస్థితుల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలోని మత్స్యకార కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

Pawan Kalyan: సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఇక పై పవన్ నిర్ణయం అదే..
Pawan Kalyan Movies
Follow us

|

Updated on: Jul 03, 2024 | 9:49 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో పర్యటించారు. పవన్‏కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి పరిస్థితుల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలోని మత్స్యకార కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా కీలక కామెంట్స్ చేశారు. సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇక పై మూడు నెలలపాటు సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉంటానని అన్నారు. వీలున్పప్పుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‏కు కేటాయిస్తానని అన్నారు.

పవన్ మాట్లాడుతూ.. ‘ నాకు సినిమాలు చేసే టైమ్‌ ఉందంటారా..? ఇక్కడ కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పని చేయాలి. లేదంటే ‘నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ‘ఓజీ’ చేస్తావా? క్యాజీ’ అంటే అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి. షూటింగ్‌ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానని చెప్పాను. ‘ఓజీ’ సినిమా బాగుంటుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ.. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలు చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇటు రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్స్ తాత్కలికంగా బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మూవీస్ నుంచి పవన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్. ఈచిత్రాల గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో నటిస్తానని పవన్ చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు