Prabhas: ఈ ఫొటోలో ఉన్న ప్రభాస్ చెల్లెళ్లు ఇప్పుడెలా ఉన్నారో చూశారా? లేటెస్ట్ పిక్స్ వైరల్

సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. పైగా అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వీటిలో ముందుగా ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు.

Prabhas: ఈ ఫొటోలో ఉన్న ప్రభాస్ చెల్లెళ్లు ఇప్పుడెలా ఉన్నారో చూశారా? లేటెస్ట్ పిక్స్ వైరల్
Prabhas Family
Follow us

|

Updated on: Oct 25, 2024 | 7:51 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇటీవలే తన పుట్టిన రోజు (అక్టోబర్ 23)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డార్లింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ఫ్యాన్స్ అయితే ప్రభాస్ పుట్టిన రోజును ఒక పండగలా జరుపుకొన్నారు. అలాగే ప్రభాస్ నటిస్తోన్న పలు సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇక ఇవన్నీ ఒకెత్తు అయితే.. ప్రభాస్ సోదరి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరలయిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా ఖుషీ చేసింది. ప్రసీద షేర్ చేసిన ఆ పోస్టులో దివంగత నటుడు కృష్ణంరాజు, ప్రభాస్ తో పాటు తన సోదరీమణులంతా ఉన్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే.. ఈ ఫొటోలన్నీ చిన్నప్పుడు దిగినవే. సిస్టర్స్ అందరూ చిన్నప్పడు ప్రభాస్‌తో సరదాగా ఉన్న ఫొటోలను ప్రసీదా షేర్ చేసింది.’ అప్పుడు, ఇప్పుడు’అంటూ ఆ ఫొటోలలో ఉన్న వారు ఇప్పుడెలా మారిపోయారో తెలిపేలా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దివంగత హీరో కృష్ణంరాజుకు నలుగురు కూతుళ్లు. వీరితో ఎంతో సరదాగా ఉంటాడు ప్రభాస్. ఇక చెల్లెళ్లకు కూడా ప్రభాస అంటే కూడా చాలా ఇష్టం.

ఇవి కూడా చదవండి

నలుగురు చెల్లెళ్లలో ప్రసీద ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. కల్కి సినిమా ప్రమోషన్ల సమయంలో ప్రభాస్ తో కలిసి ప్రసీదా దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

చెల్లెళ్లతో ప్రభాస్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ లైనప్ మాములుగా లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే మూవీ చేస్తున్నాడు డార్లింగ్. దీంతో పాటు హను రాఘవ పూడి డైరెక్షన్ లో ఫౌజి (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇక సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా చేయాల్సి ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ కూడా లైన్ లో ఉంది.

రాఖీ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ ఫ్యామిలీ..

కల్కి సినిమా ప్రమోషన్లలో ప్రభాస్ సిస్టర్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.