Tollywood: స్టేట్ బాస్కెట్ బాల్ ప్లేయర్.. ఇప్పుడు 300 కోట్ల టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ హీరోయిన్ కు చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. అందుకే చదువుతో పాటు ఈ గేమ్ పైనా ఆసక్తి పెంచుకుంది. స్టేట్ లెవెల్ గేమ్స్ లోనూ పార్టిసిపేట్ చేసింది. అయితే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో అన్నిటినీ పక్కన పెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. చెన్నైలో పుట్టి పెరిగింది. బెంగళూరులో పెరిగింది. కామర్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. పలు బ్రాండెడ్ ఉత్పత్తుల ప్రకటనల్లోనూ నటించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట సహాయక నటి, చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. అయితే వాటితోనే తన యాక్టింగ్ ట్యాలెంట్ నిరూపించుకుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా గతేడాది ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. అందం, అభినయం పరంగా ఈ సొగసరికి ఎలాంటి వంకలు పెట్టలేం. అయినా ఎందుకో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదు. గతేడాది అల్లరి నరేష్ సినిమా బచ్చలమల్లి హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ హీరోయిన్ యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తుంది. అలా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.
అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అట. చిన్నప్పటి నుంచే బాస్కెట్ బాల్ గేమ్ పై ఆసక్తి పెంచుకున్న ఈ అందాల తార పలు పోటీల్లో పాల్గొందట. అలా రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పార్టిసిపేట్ చేసిందట. అయితే నటనపై ఆసక్తి ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? హనుమాన్ ఫేమ్ అమృతా అయ్యర్.
అమృతా అయ్యర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
బిగిల్ సినిమాలో నటించిన అమృతా రెడ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అర్జుణ ఫాల్గుణ, కాఫీ విత్ కాదల్, హనుమాన్ సినిమాలతో క్రేజీ హీరోయిన గా మారిపోయింది.
ట్రెడిషినల్ శారీలో ఎంత చక్కగుందో..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








