Tollywood: ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జిమ్నాస్టిక్స్‌లోనూ మేటి.. చీరకట్టి కర్రసాము చేస్తే ఔరా అనాల్సిందే
కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియెంట్ మూవీస్ లోనే నటిస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొడుతోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోందీ అందాల తార

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితం చేస్తుంటారు. హీరోలతో పాటలు, రొమాంటిక్ సన్నివేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు కొందరు హీరోయిన్లు హీరోలతో సమానంగా ఫైట్లు చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొడుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో చాలామంది హీరోయిన్ల లాగే కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితమైందీ అందాల తార. అందులోనూ ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలే పోషించింది. దీంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ మధ్యన రిలీజైన ఒక సినిమా ఈ బ్యూటీ జీవితాన్ని మలుపు తిప్పింది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు విమర్శలకు ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ లోనే నటిస్తోంది. హీరోలతో సమానంగా గన్స్ పట్టుకుని శత్రువులతో పోరాడుతుంది. ఫైట్లు చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరగొడుతోంది. మరి ఈ డేరింగ్ బ్యూటీ ఎవరో తెలుసా? ది కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన అదాశర్మ.
ఆదివారం (మే11) ఈ అందాల తార పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ఈ డేరింగ్ బ్యూటీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు, ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజం చెప్పాలంటే అదా శర్మ మల్టీ ట్యాలెంటెడ్. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంది. డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ లో శిక్షణ తీసుకుంది. అందుకే నీళ్లు తాగినంత ఈజీగా సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తోంది. ఆ మధ్యన వచ్చిన బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో అదా శర్మ నటనకు అందరూ ఫిదా అయ్యారు.
అదాశర్మ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా సీఐడీ అనే ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో నటించింది అదా శర్మ. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది.
చీర కట్టులో అదా శర్మ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.