- Telugu News Photo Gallery Cinema photos Ashika Ranganath latest stunning looks goes viral in internet
Ashika Ranganath: ఈ పడచు అందం తాకితే పుత్తడి మరింత మెరుస్తుంది.. స్టన్నింగ్ ఆషిక..
ఆషికా రంగనాథ్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో కనిపిస్తుంది. కన్నడ చిత్రం క్రేజీ బాయ్ ఆమె తొలిసారిగా నటించింది. ఆషిక ఉత్తమ నటిగా SIIMA అవార్డును అందుకుంది - రాంబో 2, రేమో, మధగజ చిత్రాలకు నామినేట్ అవ్వగా.. మధగజకి అవార్డు గెలుచుకుంది. సోషల్ మీడియా యాక్టీవ్ గా ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇలా కొన్ని ఫోటోలను షేర్ చెయ్యగా.. అవి కాస్త వైరల్ గా మారాయి.
Updated on: May 11, 2025 | 11:15 AM

5 ఆగస్టు 1996న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఆషిక రంగనాథ్.రంగనాథ్ మరియు సుధా రంగనాథ్ ఈమె తల్లిదండులు.

ఈ వయ్యారి అనూషా రంగనాథ్ అక్క కూడా ఉంది. ఈమె కూడా నటిగా పని చేస్తుంది. తుమకూరులోని బిషప్ సార్గెంట్ స్కూల్‌లో చదువుకుంది మరియు జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ-ఇన్ కోసం బెంగళూరుకు వెళ్లింది.

అక్కడ ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ చేసింది, మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది. ఫ్రీస్టైల్, బెల్లీ మరియు వెస్ట్రన్‌తో సహా వివిధ డ్యాన్స్ స్టైల్స్ కూడా శిక్షణ పొందింది ఈ ముద్దుగుమ్మ.

దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసి క్రేజీ బాయ్ మూవీలో కథానాయకిగా అవకాశం ఇచ్చారు. SIIMA ద్వారా కథానాయకిగా ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుకు ఎంపికైంది. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది.

2023లో అమిగోస్ చిత్రంలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది. గత ఏడాది నా సామీ రంగ చిత్రంలో కనిపించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన.. తన అందంతో తెలుగు కుర్రాళ్ల మనుసు దోచేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు విశ్వంభరలో నటించింది. అలాగే తమిళంలో సర్దార్ 2 చేస్తుంది.




