Tollywood: తెలుగులో చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..
తెలుగులో ఆమె చేసిన ఒక్క సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ కట్టిపడేసింది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

సినీరంగంలో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు చేసిన ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అందుకోకుండా సినిమాలకు దూరమయ్యారు పలువురు హీరోయిన్స్. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అమృత రావు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులో మహేష్ లుక్ మాత్రమే ప్రేక్షకులను విపరీతమైన అట్రాక్ చేసింది. ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లో మరింత స్టైలీష్ గా కనిపించారు.
కథ పరంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయినప్పటికీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అమృత రావు. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందు షాహిద్ కపూర్ సరసన వివాహ్ మూవీతో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు.. కానీ హిందీలో మాత్రం ఎక్కువ సినిమాల్లోనే నటించింది. తెలుగులో చేసిన ఒక్క సినిమాతోనే అడియన్స్ హృదయాలను దొచేసింది.
చివరిసారిగా 2018లో వచ్చిన సంజు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అన్మోల్ అనే రేడియో జాకీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు ఏడేళ్లు ప్రేమలో ఉన్న వీరు 2013 మే 15న ముంబైలో పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యానిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..