Dhanush-Aishwaryaa Rajinikanth: విడిపోయిన 9 నెలల తర్వాత మళ్లీ కలుస్తోన్న స్టార్ హీరో దంపతులు.. అసలు కారణమదేనా..

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. యాత్ర రాజా, లింగ రాజా. ప్రస్తుతం ధనుష్ సర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదల చేయనున్నారు.

Dhanush-Aishwaryaa Rajinikanth: విడిపోయిన 9 నెలల తర్వాత మళ్లీ కలుస్తోన్న స్టార్ హీరో దంపతులు.. అసలు కారణమదేనా..
Dhanush Aishwarya Rajinikan
Rajitha Chanti

|

Oct 07, 2022 | 12:37 PM

గత సంవత్సర కాలంగా ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమలో పలువురు స్టార్ దంపతులు డివోర్స్ ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంటలు సైతం విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఇటీవల డివోర్స్ ప్రకటించిన జంటలలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె.. ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్ దంపతులు కూడా ఉన్నారు. వీరిద్దరు దాదాపు 18 సంవత్సరాల వివాహ బంధానికి ఇక ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇరువురు తమ సోషల్ మీడియా ఖాతాలలో వేరు వేరుగా స్పెషల్ నోట్స్ షేర్ చేశారు. అయితే విడిపోయిన తర్వాత పలుమార్లు ఫ్యామిలీ ఫంక్షన్లలో.. ఇతర కార్యక్రమాలలో వీరిద్దరు కలిసి పాల్గోన్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

వీరు తమ విడాకుల ప్రకటనను రద్దు చేసుకున్నారని.. తర్వలోనే మళ్లీ కలుస్తున్నారని తెలుస్తోంది. విడిపోయిన 9 నెలల తర్వాత తమ వివాహాన్ని పునరుద్దరించాలని నిర్ణయించుకున్నారని నెట్టింట టాక్. అయితే వీరిద్దరు మళ్లీ కలవడం వెనక సూపర్ స్టార్ రజనీకాంత్ హస్తం ఉందని టాక్ వినిపిస్తోంది. విభేదాలను పక్కన పెట్టి కనీసం పిల్లల కోసమైనా తిరిగి కలవాలని రజనీకాంత్ సూచించినట్లు తెలుస్తుంది. పిల్లల కోసం వీరు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పారట. అలాగే కుటుంబసభ్యులు కూడా చెప్పడంతో వీరిద్దరి తమ విడాకులను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. యాత్ర రాజా, లింగ రాజా. ప్రస్తుతం ధనుష్ సర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదల చేయనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu