AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mammootty: పాత వస్తువులను బట్టలను దాచుకోవడం ముమ్ముట్టికి మక్కువ.. పూజా వేడుకకు 34 ఏళ్ల నాటి సన్ గ్లాసెస్‌తో హాజరు

బరోజ్ పూజా వేడుక కోసం మోహన్‌లాల్ పెళ్లికి ధరించిన షేడ్స్‌నే మమ్ముట్టి ధరించాడు. మమ్ముట్టి తనకు ఇష్టమైన వాటిని ఎలా చూసుకుంటాడు అనేదానికి ఇదొక ఉదాహరణ.

Mammootty: పాత వస్తువులను బట్టలను దాచుకోవడం ముమ్ముట్టికి మక్కువ.. పూజా వేడుకకు 34 ఏళ్ల నాటి సన్ గ్లాసెస్‌తో హాజరు
Megastar Mammootty
Surya Kala
|

Updated on: Oct 07, 2022 | 11:37 AM

Share

మలయాళ సినీ పరిశ్రమలోని అత్యంత స్టైలిష్ నటులలో మెగా స్టార్ మమ్ముట్టి ఖచ్చితంగా ఒకరనే చెప్పాలి. పాత వస్తువులను ఎంతగానో ప్రేమిస్తారు.. దీంతో వాటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అతను కొత్త గాగుల్స్ కొనుగోలు చేసినప్పుడల్లా పాత కళ్ళజోళ్లను  విస్మరించేవాడు కాదట. మెగా స్టార్ మోహన్ లాల్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం పూజా వేడుకలో ముమ్మట్టి ఉపయోగించిన సన్ గ్లాసెస్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఈ కళ్ళజోడు మోహన్ లాల్ పెళ్ళికి ఉపయోగించారు.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే సన్ గ్లాసెస్‌తో ముమ్ముట్టి మళ్ళీ కనిపించి స్పెష్టల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు మమ్ముట్టి వెల్లడించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మోహన్‌లాల్ 1988లో పెళ్లి చేసుకున్నాడు. ఇన్నాళ్ల తర్వాత మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా బరోజ్ పూజా వేడుక కోసం మోహన్‌లాల్ పెళ్లికి ధరించిన సన్ గ్లాసెస్ నే మమ్ముట్టి ధరించాడు. మమ్ముట్టి తనకు ఇష్టమైన వాటిని ఎలా చూసుకుంటాడు అనేదానికి ఇదొక ఉదాహరణ. మోహన్‌లాల్ పెళ్లి 1988లో జరగడం విశేషం. మమ్ముట్టి తన రాబోయే సైకలాజికల్ థ్రిల్లర్ ‘రోర్షాచా’ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. మోహన్‌లాల్ పెళ్లికి తెల్లటి కుర్తా, సన్ గ్లాసెస్‌లో స్టైలిష్‌గా వచ్చిన మమ్ముటి పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ‘సంఘం’ సినిమా లొకేషన్‌ నుంచి నేరుగా పెళ్లికి హాజరయ్యారు. సన్ గ్లాసెస్ మాత్రమే కాదు, మమ్ముట్టి తన పాత బట్టలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇష్టపడతాడు. 1993లో బాక్సర్ ముహమ్మద్ అలీతో కలిసి ఉన్న చిత్రంలో మమ్ముట్టి ఇప్పటికీ ధరించినట్లు సంజు శివరామ్ ఇటీవలే వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..