Dhanush: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య.. విడాకులు రద్దు చేసుకోబోతున్నారా..?
ఇండస్ట్రీలో ఎంతో అన్యోనంగా ఉండే వీరిద్దరి విడాకులు తీసుకుంటున్నారని తెలిసి.. ఇటు ఫ్యాన్స్, అటు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. విడాకుల ప్రకటన తర్వాత కూడా వీరిద్దరు కలిసి కనిపించారు. అలాగే ఐశ్వర్య సినిమాకు సోషల్ మీడియా వేదికగా ధనుష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇదిలా ఉంటే. ఇప్పుడు వీరిద్దరి డివోర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడిపోతున్నామంటూ ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. ఈ జంటకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2022లో వీరిద్దరి డివోర్స్ ప్రకటన రాగా.. అదే ఏడాది విడిపోయేందుకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో అన్యోనంగా ఉండే వీరిద్దరి విడాకులు తీసుకుంటున్నారని తెలిసి.. ఇటు ఫ్యాన్స్, అటు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. విడాకుల ప్రకటన తర్వాత కూడా వీరిద్దరు కలిసి కనిపించారు. అలాగే ఐశ్వర్య సినిమాకు సోషల్ మీడియా వేదికగా ధనుష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇదిలా ఉంటే. ఇప్పుడు వీరిద్దరి డివోర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఈరోజు ధనుష్, ఐశ్వర్య విడాకుల పిటిషన్ పై విచారణ జరిగింది. కానీ ఇద్దరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేశారు. కొన్ని నెలల క్రితం ధనుష్, ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కాబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ విడాకుల విచారణకు హాజరు కాకపోవడం ఆ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెద్దలు ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెళ్లైన 18 ఏళ్లకు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ధనుష్ ఇండస్ట్రీలో టాప్ హీరో కాగా.. ఐశ్వర్య దర్శకురాలు. నుష్, శృతి హాసన్ జంటగా నటించిన ‘3’ చిత్రానికి ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలోని పాటలు ఘనవిజయం సాధించాయి. సినీరంగంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకుంటుందని తెలిసి అంతా షాకయ్యారు. వీరిద్దరి డివోర్స్ ఆపేందుకు రజినీ ఎంతో ప్రయత్నించారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఇటీవలే రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే హాలీవుడ్ లో మూవీలోనూ నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.