Deepika Padukone: ‘వారానికి 90 గంటల పని’..ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ప్రకటనపై దీపిక షాకింగ్ రియాక్షన్
వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలవుల్లేకుం డా ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాలని సుబ్రమణియన్ ఇటీవల చెప్పారు. తాజాగా ఈ ప్రకటనపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె స్పందించింది.
ఉద్యోగుల పని సమయానికి సంబంధించి ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారాల్లోనూ ఆఫీస్ కు రావాలని ఆయన అన్నారు. ‘ అంతేకాదు ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఏం చేస్తావు? ఎంతసేపు భార్య ముఖం చూస్తూ ఉంటావు?’ అంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఎస్‌ఎన్ సుబ్రమణియన్ ప్రకటనపై స్పందించింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ఇన్ స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టింది దీపిక. దీనికి #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించింది. తద్వారా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది దీపిక.
బిలియన్ డాలర్ల కంపెనీ అయినప్పటికీ, తన ఉద్యోగులను శనివారాల్లో ఎందుకు పని చేయిస్తున్నారని ఇటీవల ఎస్ఎన్ సుబ్రమణియన్ ను కొందరు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆదివారం కూడా తమ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. ‘ఆదివారం కూడా నా ఉద్యోగులు పనిచేస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. నేను కూడా సండే వర్క్ చేస్తున్నాను. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలి. ఇంట్లో ఉంటూ ఏం చేస్తావు, ఎంతసేపు భార్యవైపు చూస్తూ ఉంటావు? ‘అని కాస్త వెటకారంగా మాట్లాడారు ఎల్ అండ్ టీ ఛైర్మన్. ఇదిలా ఉంటే ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. యువత వారానికి కనీసం 70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.
మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా..
बॉलीवुड एक्ट्रेस दीपिका पादुकोण ने लार्सन एंड टुब्रो (L&T) के चेयरमैन एसएन सुब्रह्मण्यन के हालिया बयान के खिलाफ अपनी राय दी है. एक्ट्रेस ने अपने इंस्टाग्राम स्टोरी के जरिये कर्मचारियों से हर दिन काम करवाने की मांग का विरोध किया. pic.twitter.com/kxs01z9g0d
— GARIMA SINGH (@azad_garima) January 9, 2025
కాగా దీపిక చివరిగా కల్కి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అమ్మగా ప్రమోషన్ పొందడంతో కొద్ది రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.