Ponniyin Selvan: చూపు తిప్పుకొనివ్వని అందం.. ఉట్టిపడుతున్న రాజసం.. పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్య, త్రిష నగల ప్రత్యేకత ఇదే..
పొన్నియన్ సెల్వన్ నుంచి విడుదలైన ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్ ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి. ఎంతో అందంగా.. రాజసం ఉట్టిపడుతూ వారి పోస్టర్స్ కనపించాయి.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన చోళ సామ్రాజ్యం కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, విక్రమ్, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ నుంచి విడుదలైన ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్ ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి. ఎంతో అందంగా.. రాజసం ఉట్టిపడుతూ వారి పోస్టర్స్ కనపించాయి. అయితే ఈ సినిమాలో త్రిష (Trisha), ఐశ్వర్య (Aishwarya Rai) ధరించిన నగల గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది. వాళ్లిద్దరు ధరించిన నగలు పూర్తిగా చేతితో తయారు చేయబడ్డాయట. ఒక్క నెక్ పీస్ రెడీ చేయడానికి దాదాపు నెల సమయం పట్టిందట. ఇంతకీ ఆ ఆభరణాలకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.
పజువూరు రాణి నందిని పాత్రలో నటిస్తోన్న ఐశ్వర్యరాయ్ పాత్రలో కనిపించే ఆభరణాలు పూర్తిగా చేతితో తయారు చేశారు. జడ పిన్నులు, ముక్కుపుడక, వంకీలు, ఆర్మ్ బ్యాండ్లు, హెయిర్ పిన్నులు, లక్ష్మీదేవి సాంప్రదాయ నగలు తయారు చేశారు. వజ్రాలు, పచ్చలు, కెంపులు, పసుపు నీలమణి, ముత్యాల గాజులు ఇలా ఒక్కటేమిటీ ఒంటినిండా ఆభరణాలతో రాజనందినిలా కనిపిస్తోంది ఐశ్వర్య. ఇక త్రిష అందాల యువరాణిగా.. రాయల్టీ లుక్‌లో మరింత అందంగా కనిపిస్తోంది. ఒంటినిండా నగలతో రవివర్మ గీసిన పెయింటింగ్ లా యువరాణిగా మెరిసిపోతుంది త్రిష.
వీరిద్దరు ధరంచిన నగలను హైదరాబాద్‌కు చెందిన కిషన్ దాస్ & కో డిజైన్ చేశారు. ఇందుకోసం మొత్తం ముగ్గులు కళాకారులు పనిచేశారు. ప్రతి పాత్రకు విభిన్న కేశాంలకరణకు బన్స్, హెయిర్ డోస్ ఆధారంగా దుస్తులు, వడ్డానాలు, వంకీలు, ఝుంకాలు, నగలు తయారు చేశారు. మేకర్స్ స్ఫూర్తిని తీసుకోవడానికి.. చరిత్ర..క్యారెక్టర్ స్పెసిఫికేషన్‌లను అధ్యయనం చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. మొత్తం 18 మంది హస్తకళాకారులు ఇందులో పనిచేశారు. చేతితో తయారు చేసిన నెక్‌పీస్ పూర్తి చేయడానికి వారికి ఒక నెల పట్టింది.
వారి నైపుణ్యం ఉన్న రంగాల ఆధారంగా, కళాకారులు నకాషి పని, రాళ్లను అమర్చడం, పాలిషింగ్ వంటి ఆభరణాల తయారీలో వివిధ దశలలో సహకరించారు. చోళ రాజవంశం స్త్రీలు ధరించిన నగల గురించి అధ్యయనం చేసి.. ఆభరణాల డిజైనర్లకు ప్రతి పాత్ర గురించి క్లుప్తంగా వివరణ ఇచ్చారు. దీంతో.. పచ్చలు, కెంపులు, పసుపు నీలమణి వంటి కత్తిరించబడని విలువైన రత్నాలు ఉపయోగించి త్రిష, ఐశ్వర్య కోసం నగలు సిద్ధం చేశారు. త్రిష, ఐశ్వర్య ధరించిన నగలు చోళ రాజవంశం స్త్రీలు ఉపయోంచిన ఆభరణాలకు కొన్ని ఉదాహారణలు మాత్రమే.